స‌చిన్ రికార్డుపై క‌న్నేసిన టీమిండియా ఓపెన‌ర్‌.. | Pratika Rawal aims Sachin Tendulkars feat | Sakshi
Sakshi News home page

IND-W vs SL-W: స‌చిన్ రికార్డుపై క‌న్నేసిన టీమిండియా ఓపెన‌ర్‌..

May 3 2025 6:43 PM | Updated on May 3 2025 7:17 PM

Pratika Rawal aims Sachin Tendulkars feat

మ‌హిళ‌ల ముక్కోణ‌పు వ‌న్డే సిరీస్‌లో భార‌త జ‌ట్టు కీల‌క పోరు సిద్ద‌మైంది. ఈ సిరీస్‌లో భాగంగా ఆదివారం కొలంబో వేదిక‌గా శ్రీల‌కంతో భార‌త్ త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి త‌మ ఫైన‌ల్ బెర్త్‌ను ఖారారు చేసుకోవాల‌ని హ‌ర్మ‌న్ సేన భావిస్తోంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా యువ ఓపెన‌ర్ ప్రతీక రావల్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.

వన్డేల్లో వరుసగా అత్య‌ధిక సార్లు ఫిప్టీ ప్ల‌స్ స్లోర్లు సాధించిన భార‌త బ్యాట‌ర్‌గా దిగ్గ‌జ క్రికెట‌ర్లు స‌చిన్ టెండూల్క‌ర్‌, రాహుల్ ద్ర‌విడ్‌ను అధిగమించేందుకు ప్ర‌తీక అడుగుదూరంలో నిలిచింది.  ప్ర‌స్తుతం ప్ర‌తీక వ‌రుసగా ఐదు సార్లు  ఫిప్టీ ప్ల‌స్ స్కోర్లు సాధించి స‌చిన్‌, ద్ర‌విడ్‌తో స‌మంగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో రావ‌ల్ మ‌రో హాఫ్ సెంచ‌రీ సాధిస్తే ఈ దిగ్గ‌జ క్రికెట‌ర్ల రికార్డును బ్రేక్ చేస్తోంది. అయితే ప్ర‌తీక ఉన్న ఫామ్‌కు ఈ రికార్డు బ‌ద్ద‌లు కావ‌డం ఖాయ‌మ‌న్పిస్తోంది.

న‌యా సంచ‌ల‌నం..
కాగా భార‌త క్రికెట్‌లో ప్రతీక రావల్ పేరు మారుమ్రోగిపోతుంది. గ‌తేడాది డిసెంబ‌ర్‌లో భార‌త జ‌ట్టు త‌ర‌పున వ‌న్డే అరంగేట్రం చేసిన రావ‌ల్‌.. వ‌రుస హాఫ్ సెంచరీలతో దూసుకుపోతుంది. ఇప్ప‌టివ‌ర‌కు 8 మ్యాచ్‌లు ఆడిన ప్ర‌తీక 81.7 స‌గ‌టుతో 572 ప‌రుగుల చేసింది. అందులో ఒక సెంచ‌రీ, ఐదు ఆర్ధ‌శ‌త‌కాలు ఉన్నాయి.

ప్ర‌తీక ఆఖ‌రి ఐదు వ‌న్డే స్కోర్లు ఇవే..
89 వ‌ర్సెస్ ఐర్లాండ్( రాజ్ కోట్)
67 వ‌ర్సెస్ ఐర్లాండ్( రాజ్ కోట్)
154 వ‌ర్సెస్ ఐర్లాండ్( రాజ్ కోట్)
50 నాటౌట్ -వ‌ర్సెస్ శ్రీలంక‌(కొలంబో)
78 వ‌ర్సెస్ దక్షిణాఫ్రికా(కొలంబో)
చ‌ద‌వండి: నేను ఎదుర్కొన్న క‌ఠిన బౌల‌ర్లు వీరే: విరాట్ కోహ్లి

Advertisement
 
Advertisement
Advertisement