
ఆసియాకప్-2025లో భాగంగా అబుదాబి వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హాంకాంగ్ బ్యాటర్లు పర్వాలేదన్పించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన హాంకాంగ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 143 పరుగులు సాధించింది. హాంకాంగ్ బ్యాటర్లలో నిజాకత్ ఖాన్(42) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ యాసిమ్ ముర్తజా(28), జీషన్ అలీ(30) రాణించారు.
బంగ్లాదేశ్ బౌలర్లలో రిషద్ హుస్సేన్, తంజిమ్ హసన్ సాకిబ్, టాస్కిన్ ఆహ్మద్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. ముస్తఫిజుర్ రెహ్మన్ ఓ వికెట్ సాధించాడు. కాగా ఈ మ్యాచ్ హాంకాంగ్‌కు చాలా కీలకం. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఓడిపోతే హాంకాంగ్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించనుంది.