వావ్‌.. వాట్‌ ఎ స్టన్నింగ్‌ క్యాచ్‌

Newzealand Bowler Trent Boult Takes Stunning Catch Of Liton Das - Sakshi

వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డేలో కివీస్‌ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్.. కళ్లు చెదిరే విన్యాసం చేస్తూ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. సూపర్ మ్యాన్‌లా ఒంటి చేత్తో బంతిని అందుకొని  వావ్‌ అనిపించాడు. అతని ఫీల్డింగ్ విన్యాసానికి అభిమానులు ముగ్దులైపోయారు. ప్రస్తుతం ఆ స్టన్నింగ్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. బౌల్ట్ పట్టిన ఈ క్యాచ్‌ను ట్రెండ్ సెట్టింగ్ క్యాచ్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ఏడో ఓవర్‌ ఆఖరి బంతిని బౌలర్‌ మ్యాట్ హెన్రీ ఔట్ ఆఫ్ ది హాఫ్‌‌ స్టంప్‌ దిశగా సంధించగా.. బంగ్లా బ్యాట్స్‌మన్ లిటన్ దాస్ పుల్ షాట్ ఆడబోయాడు. కానీ బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకొని థర్డ్ మ్యాన్ దిశగా గాల్లోకి లేచింది. ఆ దిశలో ఫీల్డింగ్ చేస్తున్న ట్రెంట్ బౌల్ట్ పరుగెత్తుకుంటూ వచ్చి గాల్లోకి ఎగురుతూ ఒంటిచేత్తో సూపర్‌ క్యాచ్‌ను అందుకున్నాడు. 

కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు.. డెవాన్ కాన్వే(110 బంతుల్లో 126; 17 ఫోర్లు), డారిల్‌ మిచెల్(92 బంతుల్లో 100 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) శతకాలతో చెలరేగటంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో బంగ్లా జట్టును మ్యాట్‌ హెన్రీ(4/27), జేమ్స్‌ నీషమ్‌(5/27) దారుణంగా దెబ్బతీయడంతో ఆతిధ్య జట్టు 164 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై ఘనవిజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను కివీస్‌ 3-0తో క్లీన్‌ స్వీప్‌ చేసింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top