చెలరేగిన లాథమ్‌ ..చివరి టీ20లో కివీస్‌ గెలుపు

New Zealand vs Bangladesh: New Zealand Won By 27 Runs - Sakshi

ఢా​కా: ఢాకా వేదికగా జరిగిన ఐదో టీ20లోబంగ్లాదేశ్‌పై న్యూజిలాండ్‌ 27 పరుగులు తేడాతో విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ నిర్ణీత 20 ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి 161 పరుగులు సాధించింది. కివిస్‌లో టామ్‌ లాథమ్‌(50) ఆర్ధసెంచరీతో చెలరేగగా, ఓపెనర్ ఫిన్‌ ఆలిన్‌ (41) రాణించాడు. అనంతరం 162 పరుగుల లక్ష్యచేధనతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ 20 ఓవర్లో 8వికెట్లు  కోల్పోయి 134 పరుగులకే పరిమితమైంది.

బంగ్లాదేశ్‌లో ఆరిఫ్‌ హూస్సేన్‌(49) తప్ప బంగ్లా బ్యాట్సమన్‌లు ఎవరూ కివీస్‌ బౌలర్ల ధాటికి నిలదొక్కలేకపోయారు. న్యూజిలాండ్‌ బౌలర్లో ఎజాజ్‌ పటేల్‌,కుగ్గలిన్‌ చేరో రెండు వికెట్లు పడగొట్టగా, కోల్‌ మెక్‌ కొన్చి, రచిన్‌ రవింద్ర ,బెన్‌ సీర్స్‌ చెరో వికెట్‌ సాధించారు. కాగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-2 తేడాతో బంగ్లా జట్టు  కైవసం చేసుకుంది.

చదవండి: SL Vs SA: ఓపెనర్‌గా వచ్చి నాటౌట్‌.. అయినా గెలిపించలేకపోయాడు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top