
ఆసియాకప్-2025 సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో అబుదాబి వేదికగా అఫ్గానిస్తాన్, హాంకాంగ్ జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నీ కోసం భారత జట్టు కూడా యూఏఈ గడ్డపై అడుగు పెట్టింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత బృందం.. శుక్రవారం సాయంత్రం దుబాయ్‌లోని ఐసీసీ ఆకాడమీలో తొలి ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గోనుంది.
టీమిండియా తమ మొదటి మ్యాచ్‌లో సెప్టెంబర్ 10న దుబాయ్ వేదికగా యూఏఈతో తలపడనుంది. అయితే ఈ ఖండాంతర టోర్నీకి చాలా మంది స్టార్ ప్లేయర్లు దూరమయ్యారు. ముఖ్యంగా భారత జట్టులో కీలక ఆటగాళ్లు యశస్వి జైశ్వాల్, శ్రేయస్ అయ్యర్.. పాక్ జట్టులో మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజం, నషీంలకు చోటు దక్కకపోవడం అందరని ఆశ్చర్యపరిచింది.
అద్భుతమైన ఫామ్‌లో ఉన్న జైశ్వాల్‌ను సెలక్టర్లు స్టాండ్‌బై జాబితాలో చేర్చారు. అయ్యర్‌ను అయితే పూర్తిగా పరిగణలోకి తీసుకోలేదు. ఇప్పటికి భారత జట్టు సెలక్షన్‌పై విమర్శలు వస్తూనే ఉన్నాయి. అయితే ఆసియాకప్‌కు ఎంపిక కాని ఆటగాళ్లతో కూడిన ప్లేయింగ్ ఎలెవన్ జాబితా ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది.
కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..
ఈ ప్లేయింగ్ ఎలెవన్‌లో భారత్ నుంచి యశస్వి జైశ్వాల్, శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, సిరాజ్‌కు చోటు దక్కగా.. పాక్ నుంచి రిజ్వాన్, బాబర్, కమ్రాన్ గుఆల్, నసీం షాకు అవకాశమిచ్చారు. అదేవిధంగా బంగ్లాదేశ్ నుంచి మెహది హసన్ మిరాజ్, నహిద్ రాణా.. శ్రీలంక నుంచి ఏంజులో మాథ్యూస్ ఈ తుది జట్టులో ఉన్నారు.
ఈ జట్టుకు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌ను ఎంపిక చేశారు. ఓపెనర్లుగా జైశ్వాల్, బాబర్ ఆజం ఉండగా.. ఫస్ట్ డౌన్‌లో అయ్యర్‌కు ఛాన్స్ దక్కింది. ఇక మూడో స్ధానంలో రిజ్వాన్, నాలుగో స్ధానంలో కమ్రాన్ గులాం ఉన్నారు. ఆల్‌రౌండర్ల కోటాలో మాథ్యూస్, మెహది హసన్ మిరాజ్, సుందర్‌లకు అవకాశం దక్కింది. ఫాస్ట్ బౌలర్లగా నసీం షా, సిరాజ్, రాణాలకు చోటు లభించింది.
ఆసియాకప్‌కు ఎంపిక కాని ఆటగాళ్లతో కూడిన ప్లేయింగ్ ఎలెవన్
యశస్వి జైస్వాల్, బాబర్ ఆజం, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్, కమ్రాన్ గులామ్, ఏంజెలో మాథ్యూస్, మెహిదీ హసన్ మిరాజ్, వాషింగ్టన్ సుందర్, నసీమ్ షా, మహ్మద్ సిరాజ్, నహిద్ రాణా
చదవండి: ‘సచిన్ తప్ప ఎవరూ లేరు.. ధోని, కోహ్లిలకు యువీ అంటే భయం