
పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ ఆట తీరు ఏ మాత్రం మారలేదు. ఆసియాకప్ జట్టులో చోటు కోల్పోవడంతో రిజ్వాన్ కరేబియన్ ప్రీమియర్ లీగ్-2025లో ఆడాలని నిర్ణయించుకున్నాడు. అయితే రిజ్వాన్ తన అరంగేట్ర మ్యాచ్‌లోనే తీవ్ర నిరాశపరిచాడు.
సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న రిజ్వాన్.. శుక్రవారం బార్బడోస్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 3 పరుగులు మాత్రమే చేశాడు. కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన రిజ్వాన్ బార్బోడస్ స్పిన్నర్ వారికన్ బౌలింగ్ చెత్త షాట్ ఆడి క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఏంటి రిజ్వాన్ జట్టు నుంచి తీసేసినా మారవా అంటే నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా రిజ్వాన్ గత కొంత కాలంగా పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నాడు.
గత ఆరు ఇన్నింగ్స్‌లలో రిజ్వాన్ చేసిన స్కోర్లు ఇవి 0, 16, 53, 4, 17,0. 12 పరుగుల తేడాతో సెయింట్ కిట్స్ విజయం సాధించింది. ఈ విజయంలో కెప్టెన్ జాసెన్ హెల్డర్‌ది కీలక పాత్ర. తొలుత బ్యాటింగ్ చేసిన సెయింట్ కిట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది.
సెయింట్స్ కిట్స్ బ్యాటర్లలో కైల్ మైర్స్(42), హోల్డర్(38), ఫ్లెచర్(25) రాణించారు. బార్బోడస్ బౌలర్లలో రిమాన్ సిమాండ్స్ మూడు, డానియల్ సామ్స్ రెండు వికెట్లు పడగొట్టారు. వీరితో పాటు వారికన్, బాష్ ఒక వికెట్ సాధించారు.
నిప్పులు చెరిగిన హోల్డర్
అనంతరం 175 పరుగుల లక్ష్య చేధనలో బార్బోడస్ 18.2 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌటైంది. జాసన్ హోల్డర్ 4 వికెట్లు పడగొట్టి బార్బోడస్‌ను దెబ్బతీశాడు. అతడితో పాటు నసీం షా, నావియన్ బిడైసీ తలా రెండు వికెట్లు సాధించారు. బార్బోడస్ బ్యాటర్లలో కదీమ్ అల్లెన్(42) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
Mohammad Rizwan bowled out on 3(6) on his CPL debut 🙈#CPLpic.twitter.com/4fhAqphS0U
— Fourth Umpire (@UmpireFourth) August 22, 2025