’తొమ్మిదేళ్లు భరించినందుకు ధన్యవాదాలు’ | Mohamed Salah To Leave Liverpool At The End Of The Season | Sakshi
Sakshi News home page

Mohamed Salah: ’తొమ్మిదేళ్లు భరించినందుకు ధన్యవాదాలు’

Mar 25 2026 1:49 PM | Updated on Mar 25 2026 2:04 PM

Mohamed Salah To Leave Liverpool At The End Of The Season

ఫుట్‌బాల్‌లో ఈతరం మేటి ఆటగాళ్లుగా ముద్రపడ్డవారు లియోనల్‌ మెస్సీ,  క్రిస్టియానో రొనాల్డో. వీరిద్దరిలా అంత పాపులారిటీ సంపాదించనప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నాడు ఈజిప్ట్ ఫుట్‌బాల్ స్టార్ ఆటగాడు మహ్మద్ సాలా. ఫార్వర్డ్ ప్లేయర్‌గా స్టార్ హోదా పొందిన సాలా తొమ్మిదేళ్లుగా లివర్‌పూల్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 

అయితే లివర్‌పూల్‌తో ఉన్న తొమ్మిదేళ్ల బంధానికి ముగింపు పడనున్నట్లు సాలా ప్రకటించాడు. త్వరలోనే లివర్‌పూల్ క్లబ్‌తో ఒప్పందం ముగియనున్న వేళ దానితో ఉన్న బంధాన్ని సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ వేదికగా వీడియో రూపంలో భావోద్వేగంతో పంచుకున్నాడు. ‘అందరికీ నమస్కారం. ఈ సీజన్‌తో లివర్‌పూల్‌తో బంధం ముగియనుంది. ఏదో ఒకరోజు లివర్‌పూల్ క్లబ్ నుంచి వైదొలగాల్సిందే. కానీ ఆ దురదృష్టకరమైన రోజు రానే వచ్చింది. 

ఇది నా వీడ్కోలులో మొదటి భాగం. లివర్‌పూల్ క్లబ్‌తో తొమ్మిదేళ్లుగా సాగిన బంధంలో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. లివర్‌పూల్ అనేది కేవలం నాకు ఫుట్‌బాల్ క్లబ్ మాత్రమే కాదు అంతకుమించి. ఇంతకాలం నన్ను భరించడంతో పాటు నాకు సహకరించిన క్లబ్ యాజమాన్యానికి, నా అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు’ అని పేర్కొన్నాడు. 

2017లో లివర్‌పూల్ క్లబ్‌లో చేరిన 33 ఏళ్ల మహ్మద్ సాలా ఆ క్లబ్ తరఫున 435 మ్యాచ్‌లాడి 255 గోల్స్ సాధించాడు. తద్వారా లివర్‌పూల్ క్లబ్ తరఫున అత్యధిక గోల్స్ సాధించిన జాబితాలో ఇయాన్ రష్‌, రోజర్ హంట్‌ల తర్వాత సాలా మూడో స్థానంలో ఉన్నాడు. 2019, 2024 సీజన్లలో టైటిల్ గెలిచిన లివర్‌పూల్‌లో సాలా సభ్యుడిగా ఉన్నాడు. ఇక అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ కెరీర్‌లో ఈజిప్ట్‌ తరఫున మహ్మద్‌ సాలా 115 మ్యాచ్‌ల్లో 67 గోల్స్‌ సాధించాడు.

చదవండి: డకెట్‌ తప్పుకోవడంపై ఢిల్లీ క్యాపిటల్స్‌ స్పందన!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement