breaking news
Mohamed Salah
-
ఆఖరి నిమిషాల్లో మూడు గోల్స్.. క్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనా
ఫిఫా ప్రపంచకప్ 2026లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. రౌండ్ ఆఫ్ 16లో అర్జెంటీనా 3-2తో ఈజిప్ట్‌ను మట్టికరిపించింది. అర్జెంటీనా తరఫున క్రిస్టియన్ రోమెరో (79వ నిమిషం), లియోనల్ మెస్సీ (83వ నిమిషం), యెంజో ఫెర్నాండేజ్ (90+3వ నిమిషం) ఆట ఆఖరి నిమిషంలో మూడు గోల్స్ కొట్టారు. మరోవైపు ఈజిప్ట్ తరఫున యాసర్ ఇబ్రహీం (15వ నిమిషం), మొస్తాఫా జికో (67వ నిమిషం) గోల్స్ సాధించారు. ఇక మెస్సీకి ఈ ఫిఫాలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఇది 8వ గోల్ కావడం విశేషం. ప్రస్తుతం ఎంబాపెను దాటిన మెస్సీ 8 గోల్స్‌తో గోల్డెన్ బూట్ రేసులో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అర్జెంటీనాకు ఈజిప్ట్ చుక్కలుఇక మ్యాచ్‌లో అర్జెంటీనాకు ఈజిప్ట్ ముచ్చెమటలు పట్టించింది. తొలి హాఫ్ ముగిసేసరికి ఈజిప్ట్ ఒక గోల్ కొట్టి 1-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో హాఫ్లోనూ 67వ నిమిషంలో ముస్తాఫా జీకో రెండో గోల్ కొట్టడంతో ఈజిప్ట్ 2-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇక మ్యాచ్‌లో అర్జెంటీనా ఓడిపోతుందా? విజయం ఈజిప్ట్దేనా అనే అనుమానాలు రేకెత్తాయి.ఆఖర్లో హైడ్రామా అర్జెంటీనా మ్యాచ్ ఓడిపోతుందా అన్న సమయంలో అసలు డ్రామా మొదలైంది. మరో 15 నిమిషాల్లో ఫుల్‌టైమ్ ముగుస్తుందనగా, అర్జెంటీనా స్ట్రైకర్ క్రిస్టియన్ రొమెరో తొలి గోల్‌తో మెరిశాడు. రైట్ కార్నర్ నుంచి మెస్సీ అందించిన బంతిని బులెట్ హెడర్‌తో క్రిస్టియన్ రొమెరో నేరుగా గోల్ పోస్ట్‌లోకి తరలించాడు. ఇక 83వ నిమిషంలో మెస్సీ బంతిని నేరుగా గోల్‌పోస్ట్‌లోకి తరలించి స్కోరును 2-2తో సమం చేశాడు. 90 నిమిషాలు ముగియడంతో ఇంజ్యూరీ టైమ్ మొదలైంది. 90+3వ నిమిషంలో ఈసారి యెంజో ఫెర్నాండేజ్ హెడర్‌తో బంతిని గోల్‌పోస్ట్‌లోకి తరలించడంతో 3-2తో అర్జెంటీనా ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత ఈజిప్ట్ పలుమార్లు గోల్‌పోస్ట్‌పై దాడులు చేసినప్పటికీ లాభం లేకపోయింది.🚨 GOAL ARGENTINA!LIONEL MESSI EQUALIZES IN THE 83RD MINUTE! 🇦🇷⚽ pic.twitter.com/U0jkSMkgsT— FIFA World Cup 2026 (@FIFAWC26Updates) July 7, 2026 THIS IS WHAT IT MEANS! 💙🥺pic.twitter.com/tvg4ujENTt— BarçaTimes (@BarcaTimes) July 7, 2026 -
సలాహ్ సూపర్ షో.. ఈజిప్ట్ చారిత్రక విజయం
ఫిఫా వరల్డ్‌కప్-2026లో ఈజిప్ట్ చరిత్ర సృష్టించింది. ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ప్రపంచకప్‌లో తమ తొలి విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్-జీ పోరులో న్యూజిలాండ్‌పై 3-1 గోల్స్ తేడాతో విజయం సాధించి, ఫుట్‌బాల్ ప్రపంచంలో తమ ప్రయాణాన్ని ప్రారంభించింది.జట్టు కెప్టెన్ మొహమ్మద్ సలాహ్ కీలక సమయంలో జట్టును ముందుండి నడిపించి విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు.కెనడాలోని వాంకూవర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఈజిప్ట్ దూకుడుగా ఆడింది. ప్రారంభం నుంచే దాడులు చేస్తూ న్యూజిలాండ్‌పై ఒత్తిడి పెంచింది. ఆటలో సలాహ్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. మిడ్‌ఫీల్డ్ నుంచి దాడులను నిర్మించడమే కాకుండా ప్రత్యర్థి రక్షణను చీల్చుకుంటూ అవకాశాలు సృష్టించాడు. కీలక సమయంలో అతడు చేసిన గోల్ మ్యాచ్ గమనాన్ని పూర్తిగా మార్చేసింది.ప్రపంచ ఫుట్‌బాల్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన ఆటగాళ్లలో ఒకడైన సలాహ్ మరోసారి పెద్ద వేదికపై తన విలువను నిరూపించాడు. ఈజిప్ట్‌కు అత్యంత అవసరమైన సమయంలో గోల్ సాధించి జట్టును విజయపథంలో నిలిపాడు. ఆ గోల్‌తో ఈజిప్ట్ అభిమానుల కలలకు రెక్కలు వచ్చాయి.మ్యాచ్‌లో ఈజిప్ట్ మూడు గోల్స్‌తో ఆధిపత్యం చెలాయించినప్పటికీ న్యూజిలాండ్ చివరి వరకు పోరాటాన్ని ఆపలేదు. స్కోరును తగ్గిస్తూ మ్యాచ్‌లోకి తిరిగి రావాలని ప్రతి నిమిషం ప్రయత్నించింది. ముఖ్యంగా చివరి పది నిమిషాల్లో వరుస దాడులతో ఈజిప్ట్ రక్షణకు గట్టి పరీక్ష పెట్టింది.అయితే ఈజిప్ట్ డిఫెండర్లు అద్భుతంగా నిలబడ్డారు. బాక్స్‌లోకి వచ్చిన ప్రతి క్రాస్‌ను అడ్డుకోవడం, కీలక క్లియరెన్స్‌లు చేయడం, షాట్లను బ్లాక్ చేయడం ద్వారా ప్రత్యర్థికి అవకాశమే ఇవ్వలేదు.ఇంజరీ టైమ్‌లో న్యూజిలాండ్ దాడులు మరింత పెరిగాయి. అయినప్పటికీ ఈజిప్ట్ ఆటగాళ్లు తమ శక్తినంతా వినియోగించి ఆధిక్యాన్ని కాపాడుకున్నారు. చివరకు రిఫరీ తుది విజిల్ ఊదగానే ఈజిప్ట్ ఆటగాళ్లు, అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.ఈ విజయం కేవలం మూడు పాయింట్లకే పరిమితం కాదు. ప్రపంచకప్ చరిత్రలో ఈజిప్ట్ సాధించిన తొలి విజయం కావడంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. కైరో వీధుల నుంచి వాంకోవర్ స్టేడియం వరకు అభిమానులు ఆనందోత్సాహాలతో మునిగిపోయారు. ఎన్నో ప్రపంచకప్‌ల్లో పాల్గొన్నప్పటికీ విజయం దక్కకపోవడంతో ఎదురైన నిరాశకు ఈ ఫలితం ముగింపు పలికింది.ఈ విజయంతో గ్రూప్-జీలో ఈజిప్ట్ నాకౌట్ దశ అవకాశాలను గణనీయంగా మెరుగుపరుచుకుంది. అదే సమయంలో సలాహ్ పేరు ఈజిప్ట్ ఫుట్‌బాల్ చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోనుంది. దేశానికి తొలి ప్రపంచకప్ విజయాన్ని అందించిన కెప్టెన్‌గా అతడు చరిత్రపుటల్లోకెక్కాడు. -
చూసేద్దాం...చివరిసారి!
ఏ ఆటలో అయినా నిలకడగా రాణిస్తూ... మంచి గుర్తింపు తెచ్చుకునే ప్లేయర్లు చాలా మంది ఉంటారు. కానీ తమ ఉనికితోనే మ్యాచ్‌ను రసవత్తరంగా మార్చేసి... చిన్న కదలికలతో ఆబాలగోపాలాన్ని మంత్రముగ్ధులను చేసేవారు కొందరే! స్టార్, సూపర్ స్టార్ స్థాయి దాటేసి అలా లెజెండ్‌గా మారిన పలువురు ప్లేయర్లు ఈ ‘ఫిఫా’ ప్రపంచకప్‌తో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు టాటా చెప్పనున్నారు. లియోనెల్ మెస్సీ (అర్జెంటీనా), క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్), నెమార్ (బ్రెజిల్), మొహమ్మద్ సలా (ఈజిప్ట్), లూకా మోడ్రిక్ (క్రొయేషియా), మాన్యుయెల్ న్యూయెర్ (జర్మనీ), విర్జిల్ వాన్ డిక్ (నెదర్లాండ్స్), కెవిన్ డి బ్రూనీ (బెల్జియం), సాడియో మానె (సెనెగల్), సన్ హెంగ్ మిన్ (దక్షిణ కొరియా), జేమ్స్ రోడ్రిగెజ్ (కొలంబియా) ఇలా ఈ జాబితా చాలా పెద్దదే! ఈ దిగ్గజాలను ఆయా దేశాల తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో చూడటం దాదాపు ఇదే చివరిసారి కానుంది. అలాంటి వాళ్ల కెరీర్‌ను ఓసారి పరిశీలిస్తే...మెస్సీ... అర్జెంటీనా తురుపుముక్క సుదీర్ఘ కాలంగా అర్జెంటీనా జట్టు తురుపుముక్కగా ఉన్న స్టార్ స్ట్రయికర్ లియోనెల్ మెస్సీ ‘ఫిఫా’ ప్రపంచకప్–2026 తర్వాత కెరీర్‌కు వీడ్కోలు పలకనున్నాడు. నాలుగేళ్ల క్రితం ఖతార్‌లో జరిగిన మెగా టోర్నీ సమయంలోనే ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాలనుకున్న 39 ఏళ్ల మెస్సీ... అప్పుడు అర్జెంటీనా జట్టు వరల్డ్ చాంపియన్‌గా నిలవడంతో... సుదీర్ఘకాలంగా తాను కన్న కలను ఆస్వాదించేందుకు ఆటలో కొనసాగాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. జాతీయ జట్టు తరఫున ఇప్పటి వరకు 198 మ్యాచ్‌లాడిన మెస్సీ 115 గోల్స్ కొట్టాడు. ఐదుసార్లు ‘ఫిఫా’ వరల్డ్‌కప్‌లో పాల్గొన్న మెస్సీ... రికార్డు స్థాయిలో ఆరోసారి మెగా టోర్నీలో ఆడిన అనంతరం వీడ్కోలు పలికే అవకాశాలున్నాయి. మరే ఆటగాడికీ సాధ్యం కాని రీతిలో ఈ అర్జెంటీనా స్టార్ 26 ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడాడు. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనున్న అర్జెంటీనా జట్టు... టైటిల్‌ను నిలబెట్టుకొని మెస్సీకి ఘనంగా వీడ్కోలు పలకాలని భావిస్తోంది. అతడి నాయకత్వ పటిమ, అనుభవం ఈ టోర్నీలో అర్జెంటీనాకు మరింత బలాన్నిస్తాయని యోచిస్తోంది. ఫిట్నెస్ ఎంతో కీలకమైన ఫుట్‌బాల్‌లో 39 ఏళ్ల వయసు వరకు కొనసాగడం అంటే మామూలు విషయం కాదు. జాతీయ జట్టుతో పాటు క్లబ్‌లు కలుపుకుంటే కెరీర్లో మొత్తం 1151 అధికారిక మ్యాచ్‌లు ఆడిన మెస్సీ... 906 గోల్స్ చేశాడు.రొనాల్డో... ముందే చెప్పేశాడుయావత్ క్రీడా ప్రపంచం ‘సీఆర్7’గా పిలుచుకునే... ఫుట్‌బాల్ దిగ్గజం, పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఈ ప్రపంచకప్ అనంతరం కెరీర్‌కు వీడ్కోలు పలకనున్నాడు. మెస్సీతో సరిసమానంగా రికార్డు స్థాయిలో ఆరోసారి ‘ఫిఫా’ వరల్డ్‌కప్ బరిలోకి దిగనున్న 41 రొనాల్డో ఇదే తనకు చివరి ప్రపంచకప్ అని ఇప్పటికే వెల్లడించాడు. కెరీర్లో ఎన్నో అవార్డులు, రివార్డులు సాధించిన రొనాల్డో లెక్కకు మిక్కిలి ట్రోఫీలు సైతం చేజిక్కించుకున్నాడు. అయితే సుదీర్ఘ కాలంగా ఎంతగానో తపిస్తున్నా ‘ఫిఫా’ విన్నర్స్ ట్రోఫీ మాత్రం అతడి చేతికి చిక్కలేదు. ‘ఔర్ ఏక్ ధక్కా... ఇస్ బార్ పక్కా’ అన్నట్లు తన చివరి ప్రయత్నంలో అయినా అందని ద్రాక్షను అందుకోవాలని రొనాల్డో భావిస్తున్నాడు. 2003లో తొలిసారి జాతీయ జట్టు తరఫున బరిలోకి దిగిన రొనాల్డో... 23 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో పోర్చుగల్ తరఫున 226 మ్యాచ్‌లు ఆడి 143 గోల్స్ చేశాడు. ప్రస్తుతం సౌదీ అరేబియాకు చెందిన ‘అల్ నాసర్’ క్లబ్‌కు సారథ్యం వహిస్తున్న రొనాల్డో... ఇటీవలే సౌదీ ప్రొ లీగ్ టైటిల్ సాధించి ఫుల్ జోష్‌లో ఉన్నాడు. అదే ఊపు ప్రపంచకప్‌లోనూ కొనసాగిస్తూ తన చిరకాల లక్ష్యాన్ని అందుకుంటాడా చూడాలి. సీనియర్ స్థాయిలో ఇప్పటి వరకు 1320 మ్యాచ్‌లు ఆడిన రొనాల్డో 970 గోల్స్ చేశాడు. 41 ఏళ్ల వయసులోనూ ఫిట్‌నెస్‌కు ప్రతిరూపంగా నిలచే రొనాల్డో... సోషల్ మీడియాలో వంద కోట్లకుపైగా ఫాలోవర్స్ సంపాదించుకున్న తొలి వ్యక్తిగా అరుదైన ఘనత సైతం తన ఖాతాలో వేసుకున్నాడు.నెమార్... బ్రెజిల్ గుండె చప్పుడు మూడుసార్లు ‘ఫిఫా’ ప్రపంచకప్ ఆడిన బ్రెజిల్ సూపర్ స్టార్ నెమార్ జూనియర్ చివరి టోర్నీకి సిద్ధమవుతున్నాడు. తన తరంలో జట్టుకు అందని ట్రోఫీని అందించాలనే బలమైన సంకల్పంతో ఉన్నాడు. అయితే ఫిట్నెస్ కారణాలరీత్యా అతడు అన్నీ మ్యాచ్‌లు ఆడతాడా అనేది సందేహమే. అత్యధికంగా ఐదుసార్లు (1958, 1962, 1970, 1994, 2002లో) వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన బ్రెజిల్ ‘సిక్సర్’ కొట్టాలంటే నెమార్ ప్రదర్శన కీలకం కానుంది. ఇది తనకు చివరి మెగా టోర్నీ అని 34 ఏళ్ల నెమార్ ఇప్పటికే పలుమార్లు వెల్లడించాడు. జాతీయ జట్టు తరఫున 128 మ్యాచ్‌లు ఆడిన నెమార్... 79 గోల్స్ చేయడంతో పాటు మరో 59 గోల్స్‌కు సహకారం అందించాడు. బ్రెజిల్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్‌గా కొనసాగుతున్న నెమార్ చివరి వరల్డ్‌కప్‌లోనూ అదే నిలకడ కొనసాగించాలని భావిస్తున్నాడు. ఐదో ప్రపంచకప్ ఆడనున్న జర్మనీ గోల్ కీపర్ న్యూయెర్ (40 ఏళ్లు), మెక్సికో గోల్ కీపర్ ఒచోవా (40 ఏళ్లు), కొలంబియా కెప్టెన్ జేమ్స్ రోడ్రిగెజ్ (34 ఏళ్లు), సాడియో మానె (34 ఏళ్లు), విర్జిల్ వాన్ డిక్ (35 ఏళ్లు), కెవిన్ డి బ్రూనీ (35 ఏళ్లు), సన్ హెంగ్ మిన్ (34 ఏళ్లు) కూడా చివరిసారి ప్రపంచకప్‌లో కనిపించనున్నారు.సలా... వన్ మ్యాన్ షో క్లబ్ ఫుట్‌బాల్ లివర్‌పూల్ తరఫున సంచలనాలు నమోదు చేసిన ఈజిప్ట్ సూపర్ స్టార్ మొహమ్మద్ సలాకు కూడా ఇదే చివరి ‘ఫిఫా’ వరల్డ్‌కప్ కానుంది. 2010లో సీనియర్ స్థాయిలో తొలి మ్యాచ్ ఆడిన సలా జాతీయ జట్టు తరఫున ఇప్పటి వరకు 115 మ్యాచ్‌లాడి 67 గోల్స్ చేశాడు. అటాకింగ్‌కు పెట్టింది పేరైన సలా... రెప్పపాటులో ప్రత్యర్థి ప్లేయర్లను బోల్తా కొట్టించడంలో నేర్పరి. ఇప్పటి వరకు ఒకే ఒక్కసారి (2018లో) ప్రపంచకప్ బరిలోకి దిగిన సలా... 2 మ్యాచ్‌లాడి రెండు గోల్స్ చేశాడు. క్లబ్ ఫుట్‌బాల్‌లో 750కి పైగా మ్యాచ్‌లాడిన అనుభవం ఉన్న అతడు... ఈజిప్ట్‌ను ఎలా ముందుకు నడిపిస్తాడనేది కీలకం. మైదానంలో అతడి వేగం, గోల్స్ చేయడంలో అతడి సామర్థ్యంపై ఈజిప్ట్ భారీ ఆశలు పెట్టుకుంది. సుదీర్ఘ ‘ఫిఫా’ వరల్డ్‌కప్ చరిత్రలో ఈజిప్ట్ ఇప్పటి వరకు మూడుసార్లు (1934, 1990, 2018) మాత్రమే మెగా టోర్నీకి అర్హత సాధించింది. 33 ఏళ్ల సలాకు ఫిట్నెస్ పరంగా సమస్యలు లేకపోయినా... ఇప్పటి వరకు ప్రపంచకప్‌లో ఒక్క మ్యాచ్ కూడా గెలవని ఈజిప్ట్ వచ్చే సీజన్‌కు అర్హత సాధిస్తుందా అనేది అనుమానమే. ఈ నేపథ్యంలో... అతడికిదే చివరి ప్రపంచకప్ అయ్యే అవకాశాలున్నాయి. లూకా మోడ్రిచ్... క్రొయేషియా ఆశ క్రొయేషియా మిడ్‌ఫీల్డర్ లూకా మోడ్రిచ్ ఐదోసారి ప్రపంచకప్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ఆ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత జాతీయ జట్టు ఆడిన సగానికి పైగా మ్యాచ్‌ల్లో బరిలోకి దిగిన 40 ఏళ్ల మోడ్రిక్ చివరిసారి ‘ఫిఫా’ వరల్డ్‌కప్ టోర్నీ ఆడనున్నాడు. కెరీర్లో 196 మ్యాచ్‌లాడిన మోడ్రిచ్... 28 గోల్స్ చేశాడు. గోల్స్ పరంగా చూసుకుంటే సంఖ్య తక్కువే కనిపించినా మిడ్‌ఫీల్డ్‌లో అతడి అనుభవం జట్టుకు ఎంత బలాన్నిస్తుందో గత ప్రపంచకప్‌లో రుజువైంది. 2022 టోర్నీలో అనూహ్య ఆటతీరుతో జట్టును ముందుకు నడిపించిన మోడ్రిచ్... క్రొయేషియాను మూడో స్థానంలో నిలిపాడు. ప్రస్తుతం ఇటలీ లీగ్‌లో ఏసీ మిలాన్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న లూకా... ఇటీవల గాయపడి కోలుకున్నాడు. ముఖానికి శస్త్రచికిత్స జరిగిన నేపథ్యంలో ఈ టోర్నీలో అతడు సేఫ్టీ మాస్క్‌తో బరిలోకి దిగొచ్చు. క్రొయేషియా జట్టు సంధి దశలో ఉన్న ప్రస్తుత తరుణంలో లూకా అనుభవం ఆ జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుందని మేనేజర్ డాలీ ఆశాభావం వ్యక్తం చేశాడు. – సాక్షి క్రీడా విభాగం -
’తొమ్మిదేళ్లు భరించినందుకు ధన్యవాదాలు’
ఫుట్‌బాల్‌లో ఈతరం మేటి ఆటగాళ్లుగా ముద్రపడ్డవారు లియోనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో. వీరిద్దరిలా అంత పాపులారిటీ సంపాదించనప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నాడు ఈజిప్ట్ ఫుట్‌బాల్ స్టార్ ఆటగాడు మహ్మద్ సాలా. ఫార్వర్డ్ ప్లేయర్‌గా స్టార్ హోదా పొందిన సాలా తొమ్మిదేళ్లుగా లివర్‌పూల్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే లివర్‌పూల్‌తో ఉన్న తొమ్మిదేళ్ల బంధానికి ముగింపు పడనున్నట్లు సాలా ప్రకటించాడు. త్వరలోనే లివర్‌పూల్ క్లబ్‌తో ఒప్పందం ముగియనున్న వేళ దానితో ఉన్న బంధాన్ని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా వీడియో రూపంలో భావోద్వేగంతో పంచుకున్నాడు. ‘అందరికీ నమస్కారం. ఈ సీజన్‌తో లివర్‌పూల్‌తో బంధం ముగియనుంది. ఏదో ఒకరోజు లివర్‌పూల్ క్లబ్ నుంచి వైదొలగాల్సిందే. కానీ ఆ దురదృష్టకరమైన రోజు రానే వచ్చింది. ఇది నా వీడ్కోలులో మొదటి భాగం. లివర్‌పూల్ క్లబ్‌తో తొమ్మిదేళ్లుగా సాగిన బంధంలో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. లివర్‌పూల్ అనేది కేవలం నాకు ఫుట్‌బాల్ క్లబ్ మాత్రమే కాదు అంతకుమించి. ఇంతకాలం నన్ను భరించడంతో పాటు నాకు సహకరించిన క్లబ్ యాజమాన్యానికి, నా అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు’ అని పేర్కొన్నాడు. 2017లో లివర్‌పూల్ క్లబ్లో చేరిన 33 ఏళ్ల మహ్మద్ సాలా ఆ క్లబ్ తరఫున 435 మ్యాచ్‌లాడి 255 గోల్స్ సాధించాడు. తద్వారా లివర్‌పూల్ క్లబ్ తరఫున అత్యధిక గోల్స్ సాధించిన జాబితాలో ఇయాన్ రష్, రోజర్ హంట్‌ల తర్వాత సాలా మూడో స్థానంలో ఉన్నాడు. 2019, 2024 సీజన్లలో టైటిల్ గెలిచిన లివర్‌పూల్‌లో సాలా సభ్యుడిగా ఉన్నాడు. ఇక అంతర్జాతీయ ఫుట్‌బాల్ కెరీర్లో ఈజిప్ట్ తరఫున మహ్మద్ సాలా 115 మ్యాచ్‌ల్లో 67 గోల్స్ సాధించాడు.pic.twitter.com/mSP9S4pfpu— Mohamed Salah (@MoSalah) March 24, 2026చదవండి: డకెట్ తప్పుకోవడంపై ఢిల్లీ క్యాపిటల్స్ స్పందన!


