మిచెల్ శాంట్నర్‌ అద్బుతం.. క్యాచ్‌ ఆఫ్‌ది టోర్నమెంట్‌! వీడియో వైరల్‌ | CWC 2023: Mitchell Santner takes 'catch of the tournament' | Sakshi
Sakshi News home page

World Cup 2023: మిచెల్ శాంట్నర్‌ అద్బుతం.. క్యాచ్‌ ఆఫ్‌ది టోర్నమెంట్‌! వీడియో వైరల్‌

Oct 18 2023 8:26 PM | Updated on Oct 19 2023 9:22 AM

Mitchell Santner takes catch of the tournament - Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా ఇప్పటికే ఎన్నో అద్బుతమైన క్యాచ్‌లను చూశాం. తాజాగా న్యూజిలాండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ మిచెల్ శాంట్నర్‌ మరో సంచలన క్యాచ్‌తో మెరిశాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా చెన్నై వేదికగా ఆఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శాంట్నర్‌ కళ్లు చెదిరే క్యాచ్‌ను అందుకున్నాడు.

ఆఫ్గాన్‌ ఇన్నింగ్స్‌ 14 ఓవర్‌లో ఆఖరి బంతిని లూకీ ఫెర్గూసన్‌ షార్ట్‌బాల్‌గా సంధించాడు. స్ట్రైక్‌లో ఉన్న హష్మతుల్లా షాహిదీ ఫుల్‌షాట్‌ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే షాట్‌ కనక్ట్‌ కాకపోవడంతో బంతి స్క్వేర్ లెగ్ దిశగా గాల్లోలోకి లేచింది. ఈ క్రమంలో మిడాన్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న శాంట్నర్‌ పరిగెత్తుకుంటూ వెళ్లి డైవ్‌ చేస్తూ సింగిల్‌ హ్యాండ్‌ క్యాచ్‌ను అందుకున్నాడు.

ఇది చూసిన బ్యాటర్‌తో పాటు ప్రేక్షకులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో​ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది కచ్చితంగా క్యాచ్‌ ఆఫ్‌ది టోర్నమెంట్‌గా నిలుస్తుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో తొలుత  బ్యాటింగ్‌కు చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది.
చదవండి: World Cup 2023: అంపైర్లపై సంచలన వ్యాఖ్యలు చేసిన డేవిడ్ వార్నర్‌...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement