MLC 2023: MI New York beat Texas Super Kings to enter final - Sakshi
Sakshi News home page

MLC 2023: జూనియర్‌ 'ఏబీడీ' సూపర్‌ ఇన్నింగ్స్‌.. ఫైనల్‌కు చేరిన ముంబై ఇండియన్స్‌ టీ​మ్‌

Jul 29 2023 10:50 AM | Updated on Jul 29 2023 12:07 PM

MI New York beat Texas Super Kings to enter final - Sakshi

మేజర్‌ లీగ్‌ క్రికెట్‌(MLC 2023) తొలి ఎడిషన్‌లో ముంబై న్యూయార్క్‌ జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ లీగ్‌లో భాగంగా శనివారం తెల్లవారుజామున(భారత కాలామాన ప్రకారం) టెక్సస్‌ సూపర్‌కింగ్స్‌తో జరిగిన ఛాలెంజర్‌లో 6 వికెట్ల తేడాతో ముంబై విజయం సాధించింది. 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 19 ఓవర్లలో ఛేదించింది.

న్యూయర్క్‌ జట్టు లక్ష్య ఛేదనలో ఆ జట్టు యువ ఆటగాడు, జూనియర్‌ ఏబీడీ డెవాల్డ్‌ బ్రెవిస్‌ కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. 33 బంతుల్లో 2 సిక్స్‌లు, 1 ఫోర్‌ సాయంతో 41 పరుగుల చేసి తన జట్టును ఫైనల్‌కు చేర్చాడు. అతడితో పాటు షాయన్ జహంగీర్(36), టిమ్‌ డేవిడ్‌(33) పరుగులతో రాణించారు. టెక్సస్‌ సూపర్‌ కింగ్స్‌ బౌలర్లలో సామ్స్‌, మెహ్సిన్‌, థెరాన్‌ తలా వికెట్‌ సాధించారు.

                                       

అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన  సూపర్‌ కింగ్స్‌ నిర్ణీత ఓవర్లలో 158 పరుగులకు ఆలౌటైంది. సూపర్‌ కింగ్స్‌ బ్యాటర్లలో కాన్వే(38), మిలాంద్‌ కుమార్‌(37) పరుగులతో రాణించారు. ముంబై బౌలర్లలో బౌల్ట్‌ నాలుగు వికెట్లతో చెలరేగగా.. టిమ్‌ డేవిడ్‌ రెండు, ఇషాన్‌ అదిల్‌, రషీద్‌ ఖాన్‌ తలా వికెట్‌ సాధించారు. ఇక ఆదివారం జరగనున్న టైటిల్‌ పోరులో సీటెల్ ఓర్కాస్,ముంబై న్యూయార్క్‌ జట్లు అమీ తుమీ తెల్చుకోనున్నాయి.
చదవండి: Zim Afro T10: రాబిన్ ఉతప్ప విధ్వంసం.. 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో! వీడియో వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement