
ఆసియా క్రీడల బాక్సింగ్ ఈవెంట్‌లో మంగళవారం భారత్‌కు రెండు కాంస్య పతకాలు లభించాయి. మహిళల 54 కేజీల విభాగంలో ప్రీతి పవార్... పురుషుల ప్లస్ 92 కేజీల విభాగంలో నరేందర్ సెమీఫైనల్ బౌట్‌లలో ఓడిపోయి కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు. ప్రీతి 0–5తో చాంగ్ యువాన్ (చైనా) చేతిలో... నరేందర్ 0–5తో కున్‌కబయేవ్ (కజకిస్తాన్) చేతిలో ఓటమి చవిచూశారు.
మహిళల 75 కేజీల విభాగంలో భారత బాక్సర్ లవ్లీనా బొర్గోహైన్ ఫైనల్లోకి దూసుకెళ్లి స్వర్ణ, రజత పతకం రేసులో నిలిచింది. అంతే కాకుండా పారిస్ ఒలింపిక్స్ క్రీడలకు అర్హత సాధించింది. సెమీఫైనలో లవ్లీనా 5–0తో బైసన్ మనికోన్ (థాయ్‌లాండ్)పై గెలిచింది. పురుషుల 57 కేజీల విభాగం క్వార్టర్ ఫైనల్లో భారత బాక్సర్ సచిన్ సివాచ్ 1–4తో లియు పింగ్ (చైనా) చేతిలో ఓడిపోయాడు.
చదవండి: ODI WC 2023: అహ్మదాబాద్‌కు చేరుకున్న ఇంగ్లండ్-కివీస్ జట్లు