
వన్డే ప్రపంచకప్-2023లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా లక్నో వేదికగా ఇంగ్లండ్‌పై 89 పరుగులతో రోహిత్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 40 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాను రోహిత్ శర్మ.. రాహుల్‌తో కలిసి అదుకున్నాడు.
వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 91 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం రాహుల్ ఔటైనప్పటికీ రోహిత్ తన పనిని తను చేసుకోపోయాడు. అయితే 89 పరుగుల వ్యక్తి గత స్కోర్ వద్ద భారీ షాట్‌కు ప్రయత్నించి హిట్‌మ్యాన్ తన వికెట్ కోల్పోయాడు.
లివింగ్ స్టోన్ సూపర్ క్యాచ్..
టీమిండియా ఇన్నింగ్స్ 37 ఓవర్ వేసిన అదిల్ రషీద్ బౌలింగ్‌లో ఐదో బంతిని రోహిత్ డిప్ మిడ్ వికెట్ దిశగా భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోవడంతో గాల్లోకి లేచింది. ఈ క్రమంలో లివింగ్ స్టోన్ పరిగెత్తుకుంటూ వచ్చి డైవ్ చేస్తూ అద్బుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు.
ఈ క్రమంలో ఔట్‌ఫీల్డ్ చిత్తడి కారణంగా లివింగ్ స్టోన్ మోచేతికి గాయమైంది. అయితే అతడి గాయం అంత తీవ్రమైనది కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇంగ్లండ్ టార్గెట్ 230 పరుగులు..
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో కెప్టెన్ రోహిత్ శర్మ(101 బంతుల్లో 87), సూర్యకుమార్ యాదవ్(47 బంతుల్లో 49 పరుగులు) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇంగ్లండ్ బౌలర్లలో డేవిడ్ విల్లీ 3 వికెట్లు పడగొట్టగా.. క్రిస్ వోక్స్, అదిల్ రషీద్ తలా రెండు వికెట్లు సాధించారు.
చదవండి: World Cup 2023: విరాట్ కోహ్లి డకౌట్.. ఈజీ క్యాచ్ ఇచ్చి! ఇదే తొలిసారి! వీడియో వైరల్
— Sitaraman (@Sitaraman112971) October 29, 2023