పాకిస్తాన్ సూపర్ లీగ్‌ విజేత లాహోర్.. ఆరేళ్ల తర్వాత!

Lahore Qalandars Defat Multan Sultans to win PSL 2022 - Sakshi

పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో లాహోర్ ఖలందర్స్ కొత్త ఛాంపియన్‌గా అవతరించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ముల్తాన్ సుల్తాన్స్‌ను 42 పరుగుల తేడాతో ఓడించిన లాహోర్.. తొలి సారి టైటిల్‌ను ముద్దాడింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన లహోర్ కేవలం 25 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడంది. ఆ సమయంలో ఆల్ రౌండర్‌ మహ్మద్ హఫీజ్ జట్టును అదుకున్నాడు. 46 బంతుల్లో 69 పరుగులు హఫీజ్‌ సాదించాడు. హపీజ్‌తో పాటు చివర్లో బ్రూక్‌,డేవిడ్ వైస్ మెరుపులు మెరిపించడంతో లాహోర్ ఖలందర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నస్టానికి 180 పరుగులు చేసింది.

లహోర్‌ బ్యాటర్లలో హఫీజ్‌(69),బ్రూక్‌(41), వైస్(28) పరుగులతో రాణించారు. ఇక 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముల్తాన్ సుల్తాన్స్‌ 138 పరుగులకే కుప్పకూలింది. లహోర్‌ బౌలర్లలో కెప్టెన్ షాహీన్‌ షా ఆఫ్రిది మూడు వికెట్ల పడగొట్టగా..  హఫీజ్‌, జమాన్‌ ఖాన్‌ చెరో రెండు వికెట్లు సాధించారు. కాగా లాహోర్ ఖలందర్స్‌ కెప్టెన్‌గా స్టార్‌ బౌలర్‌ షాహీన్‌ షా ఆఫ్రిది వ్యవహరించాడు. అయితే ఆరు సీజన్‌లు తర్వాత లహోర్‌కు టైటిల్‌ అందించిన  షాహీన్‌ షా ఆఫ్రిదిపై ప్రశంసల వర్షం కురిస్తోంది.

చదవండి: Russia Ukraine War: వార్‌ ఎఫెక్ట్‌: పుతిన్‌కు మరో షాక్‌.. జూడో ఫెడరేషన్‌ పదవి ఊడింది

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top