సాక్షి, హైదరాబాద్: భారత మహిళల చెస్ నంబర్‌వన్, ప్రపంచ మూడో ర్యాంకర్ కోనేరు హంపి స్పెయిన్‌లో ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ మహిళల టీమ్ చెస్ చాంపియన్‌షిప్ కోసం బాగా సన్నద్ధమైంది. అందుబాటులో ఉన్న ఆన్‌లైన్ టోర్నీ ల్లో చురుగ్గా పోటీపడింది. అయితే తీరా స్పెయిన్ ఈవెంట్ ఆడదామనుకుంటే ఆమె తీసుకున్న టీకా వల్ల ఆంక్షలు ఎదురయ్యాయి. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ హంపి భారత్‌లో తయారైన కోవాగ్జిన్ టీకా తీసుకుంది. కానీ దీనికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) గుర్తింపు లేదు. దీని వల్ల ఆమె స్పెయిన్ వెళ్లాలనుకుంటే మునుపటిలాగే కరోనా ప్రొటోకాల్ పాటించాలి. 10 రోజుల పాటు కఠిన క్వారంటైన్‌లో గడపాలి.
ఈ విషయాలన్నీ హంపికి స్పెయిన్ రాయబార కార్యాలయాన్ని సంప్రదిస్తేనే తెలిశాయి. ‘నార్త్ మెసిడోనియా మీదుగా స్పెయిన్ వెళ్లాలనుకున్నా. కానీ అక్కడా స్పెయిన్ మాదిరిగానే ఆంక్షలు ఉన్నాయి. అక్కడా పది రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాల్సి వచ్చేది. ఆంక్షలు సడలించే అవకాశం ఉందేమోనని భారత చెస్ సమాఖ్య కూడా జోక్యం చేసుకుంది. కానీ వారి ప్రయత్నం కూడా ఫలించలేదు’ అని హంపి వివరించింది. కోవాగ్జిన్‌పై ఉన్న ఆంక్షల వల్ల ఆమె ఓ మేటి ఈవెంట్‌లో పాల్గొనలేకపోయింది. ఆమె స్థానం భర్తీ చేసేందుకు ఎంపిక చేసిన పద్మిని రౌత్‌కు అదే సమస్య ఎదురైంది. కోవాగ్జిన్‌తో ఆమె కూడా స్పెయిన్ పయనం కాలేకపోయింది. డబ్ల్యూహెచ్‌ఓ ఆమోదించిన కోవిషీల్డ్‌ను వేయించుకున్న వారికి 122 దేశాలు ఆంక్షలు సడలించాయి.
చదవండి: Koneru Humpy: థ్యాంక్యూ సాక్షి.. న్యాయ నిర్ణేతలకు ధన్యవాదాలు
Comments
Please login to add a commentAdd a comment