హ్యాపీ బర్త్‌డే.. పిచ్చి పిల్ల | KL Rahul Birthday Wishes To Athiya Shetty Made Special | Sakshi
Sakshi News home page

గర్ల్‌ఫ్రెండ్‌కు కేఎల్‌ రాహుల్‌ బర్త్‌డే విషెస్‌

Nov 6 2020 10:33 AM | Updated on Nov 6 2020 3:16 PM

AKL Rahul Birthday  Wishes To Athiya Shetty  Made Special  - Sakshi

ముంబై :  బాలీవుడ్‌ నటి అతియా శెట్టి  28వ‌ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆమె ప్రియుడు కేఎల్‌ రాహుల్‌ ప్రేమపూర్వకంగా విషెస్‌ తెలియజేశాడు. ఆమె పుట్టినరోజును మరికాస్త స్పెషల్‌గా ఉండేలా ఓ క్యూట్‌ పోస్టును ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. హ్యాపీ బర్త్‌డే మ్యాడ్‌చైల్డ్‌ (పిచ్చి పిల్ల) అంటూ రాహుల్‌ భుజంపై అతియా తల ఆనించి ఉన్న లవ్లీ ఫోటోను షేర్‌ చేశారు. కాగా అతియా, కేఎల్‌ రాహుల్‌ ఏడాది నుంచి డేటింగ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ జంట ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నా.. ఈ విషయంపై వీరు ఇప్పటి వరకు స్పందించలేదు. అయితే వారిద్దరి సోషల్​మీడియా పోస్టులు మాత్రం తరచూ వైరల్​ అవుతున్నాయి.  (వైరల్‌: ప్రేయసి పోస్టుపై కేఎల్‌ రాహుల్‌ కామెంట్‌..)

ఇటీవల రాహుల్​ పుట్టినరోజు సందర్భంగా అతియా శుభాకాంక్షలు తెలుపుతూ ‘అతను నా వ్యక్తి’ అని సోషల్‌ మీడియాలో పేర్కొంది. ఇద్దరు కలిసి తరచూ డిన్నర్‌లు, పార్టీలకు హాజరు అవుతున్నారు. అతియా శెట్టి నటుడు సునీల్ శెట్టి-మనశెట్టి కుమార్తె. 2015లో హీరో చిత్రంతో అతియా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. చివరిసారిగా  నవాజుద్దీన్ సిద్దిఖీ సరసన ‘మోటిచూర్ చక్నాచూర్’లో కనిపించింది. సంవ‌త్సరం నుంచి రిలేష‌న్‌షిప్‌లో ఉన్న రాహుల్‌, అతియాలు పెళ్లి చేసుకుంటే  మాకు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని సునీల్ శెట్టి దంప‌తులు ఇదివ‌ర‌కే పేర్కొన్నారు. (గ‌ర్ల్‌ఫ్రెండ్ విషెస్‌కు రిప్లై ఇవ్వ‌ని రాహుల్‌)

Happy birthday mad child 🖤

A post shared by KL Rahul👑 (@rahulkl) on

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement