
ఆసియా కప్-2025కు ముందు టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్ అరివీర భయంకరమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. కేరళ టీ20 లీగ్‌లో పట్టపగ్గాల్లేకుండా చెలరేగుతున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటికే విధ్వంసకర శతకం (51 బంతుల్లో 121), రెండు మెరుపు అర్ద శతకాలు (46 బంతుల్లో 89, 37 బంతుల్లో 62) బాదిన అతను.. తాజాగా మరో సుడిగాలి అర్ద శతకం బాదాడు.
అలెప్పీ రిపిల్స్‌తో నిన్న (ఆగస్ట్ 31) జరిగిన మ్యాచ్‌లో 41 బంతుల్లో 2 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 83 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో సంజూ సిక్సర్ల యంత్రాన్ని తలపిస్తున్నాడు. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో నమ్మశక్యంకాని రీతిలో 30 సిక్సర్లు బాదాడు.
NO LOOK SIX BY SANJU SAMSON..!!! 🥶 pic.twitter.com/kY0RKn0KlP
— Johns. (@CricCrazyJohns) August 31, 2025
ప్రస్తుతం సంజూ జోరు చేస్తుంటే ఆసియా కప్‌లో ప్రత్యర్థుల పరిస్థితేంటో అర్ద కావడం లేదు. ఇదే ఫామ్‌ను అతను అక్కడ కూడా కొనసాగిస్తే, కొంత మంది బౌలర్ల కెరీర్‌లు అర్దంతరంగా ముగిసిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంతటి భీకర ఫామ్‌లో ప్రస్తుతం సంజూ ఉన్నాడు.
ఆసియా కప్‌కు జట్టును ప్రకటించిన తొలినాళ్లలో సంజూ బ్యాటింగ్ స్థానంపై చాలా వాదనలు వినిపించాయి. శుభ్‌మన్ గిల్ ఎంట్రీతో అతనికి ఓపెనింగ్ స్థానం వదిలేసి సంజూను మిడిలార్డర్‌లో పంపాలని చాలామంది వాదించారు.
ఈ వాదనలన్నిటికీ సంజూ బ్యాట్‌తో సమాధానం చెప్పాడు. కేరళ టీ20 లీగ్‌లో ఓపెనర్ స్థానంలో మహా విస్పోటనం సృష్టిస్తున్నాడు. ఈ టోర్నీలో సంజూ ఆడిన నాలుగు విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఓపెనర్‌గా వచ్చి ఆడినవే. ఓ మ్యాచ్‌లో సంజూ మిడిలార్డర్‌లో వచ్చి ప్రయోగం చేసినా అది మిస్ ఫైర్ అయ్యింది.
తాజాగా జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా సంజూ ఉగ్రరూపం పతాక స్థాయికి చేరింది. అలెప్పీ రిపిల్స్‌పై సంజూ ఏకంగా 9 సిక్సర్లు బాదాడు. 177 లక్ష్య ఛేదనలో సిక్సర్ల సునామీ సృష్టించి ఒంటిచేత్తో తన జట్టును గెలిపించాడు. సంజూ విధ్వంసం ధాటికి అతని జట్టు కొచ్చి బ్లూ టైగర్స్ మరో 10 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది.