‘టాప్‌’లోకి జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ | Sakshi
Sakshi News home page

‘టాప్‌’లోకి జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌

Published Thu, Feb 8 2024 3:45 AM

Jaipur Pink Panthers in Top - Sakshi

న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్‌ పదో సీజన్‌లో ఇప్పటికే ప్లే ఆఫ్స్‌ దశకు అర్హత సాధించిన జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ జట్టు మళ్లీ అగ్రస్థానంలోకి దూసుకొచ్చింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో పింక్‌ పాంథర్స్‌ 27–22తో దబంగ్‌ ఢిల్లీని ఓడించింది. జైపూర్‌ తరఫున అర్జున్‌ దేశ్వాల్‌ 10 పాయింట్లు స్కోరు చేశాడు. ఈ లీగ్‌లో పింక్‌ పాంథర్స్‌కిది 13వ విజయం కావడం విశేషం.

ప్రస్తుతం పింక్‌ పాంథర్స్‌ 77 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లోకి వచ్చింది. పుణేరి పల్టన్‌ 76 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. మరో మ్యాచ్‌లో పుణేరి పల్టన్‌ 40–31తో బెంగళూరు బుల్స్‌పై గెలిచింది. నేడు విశ్రాంతి దినం. శుక్రవారం జరిగే మ్యాచ్‌ల్లో బెంగాల్‌ వారియర్స్‌తో గుజరాత్‌ జెయింట్స్‌; హరియాణా స్టీలర్స్‌తో యూపీ యోధాస్‌ తలపడతాయి. 

Advertisement
 
Advertisement