రాయల్స్‌ బౌలర్ల విజృంభణ.. కుప్పకూలిన సీఎస్‌కే | IPL 2026: Rajasthan royals bowlers collapse CSK to just 127 runs | Sakshi
Sakshi News home page

రాయల్స్‌ బౌలర్ల విజృంభణ.. కుప్పకూలిన సీఎస్‌కే

Mar 30 2026 9:29 PM | Updated on Mar 30 2026 9:29 PM

IPL 2026: Rajasthan royals bowlers collapse CSK to just 127 runs

ఐపీఎల్‌ 2026లో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో ఇవాళ (మార్చి 30) జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ బౌలర్లు చెలరేగిపోయారు. వీరి ధాటికి సీఎస్‌కే బ్యాటింగ్‌ లైనప్‌ పేకమేడలా కుప్పకూలింది. గౌహతిలోని బర్సపరా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన రాయల్స్‌ సీఎస్‌కేను 19.4 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌట్‌ చేసింది.

తొలి బంతి నుంచే రాయల్స్‌ బౌలర్లను ఎదుర్కొనేందుకు సీఎస్‌కే బ్యాటర్లు తెగ ఇబ్బంది పడ్డారు. ఆరంభ ఓవర్లలో నండ్రే బర్గర్‌, జోఫ్రా ఆర్చర్‌ నిప్పులు చెరిగారు. రెండో ఓవర్‌ చివరి బంతికి తొలిసారి సీఎస్‌కే తరఫున ఆడుతున్న సంజూ శాంసన్‌ను (6) బర్గర్‌.. మూడో ఓవర్‌ చివరి బంతికి సీఎస్‌కే సారధి రుతురాజ్‌ గైక్వాడ్‌ను (6) ఆర్చర్‌ అద్భుతమైన బంతులతో క్లీన్‌ బౌల్డ్‌ చేశారు. ఆమరుసటి బంతికే (3.1 ఓవర్‌) యువ ఆటగాడు ఆయుశ్‌ మాత్రేను బర్గర్‌ మరో అద్భుతమైన బంతితో డకౌట్‌ చేశాడు.

ఆతర్వాత మాథ్యూ షార్ట్‌ను (2) సందీప్‌ శర్మ.. సర్ఫరాజ్‌ ఖాన్‌ (17), శివమ్‌ దూబేను (6) రవీంద్ర జడేజా ఒకే ఓవర్‌లో పెవిలియన్‌కు పంపారు. కొద్ది సేపటికే కార్తీక్‌ శర్మను (18) బ్రిజేశ్‌ శర్మ.. నూర్‌ అహ్మద్‌ను (1) జోఫ్రా ఆర్చర్‌ ఔట్‌ చేశారు. మరి కొద్ది సేపటికి మ్యాట్‌ హెన్రీని (5) రవి బిష్ణోయ్‌ పెవిలియన్‌కు పంపగా.. ఓవర్టన్‌ (43) ఔట్‌ కావడంతో సీఎస్‌కే ఇన్నింగ్స్‌కు ఎండ్‌ కార్డ్‌ పడింది.

చివర్లో ఓవర్టన్‌ అనూహ్యమైన పోరాటాన్ని ప్రదర్శించడంతో సీఎస్‌కే 100 పరుగుల మార్కును దాటగలిగింది. అతనికి అన్షుల్‌ కంబోజ్‌ (7 నాటౌట్‌) సహకరించాడు. రాయల్స్‌ బౌలర్లలో ఆ‍ర్చర్‌, బర్గర్‌, రవీంద్ర జడేజా తలో 2.. బ్రిజేష్‌ శర్మ, సందీప్‌ శర్మ, రవి బిష్ణోయ్‌ తలో వికెట్‌ పడగొట్టారు. సీఎస్‌కే ఇన్నింగ్స్‌లో ఓవర్టన్‌తో పాటు కార్తీక్‌ శర్మ (18, సర్ఫరాజ్‌ ఖాన్‌ (17) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. సంజూ శాంసన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, శివమ్‌ దూబే తలో 6, మాథ్యూ షార్ట్‌ 2, నూర్‌ అహ్మద్‌ 1, మ్యాట్‌ హెన్రీ 5, ఆయుశ్‌ మాత్రే డకౌటయ్యారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement