జింబాబ్వే టూర్‌కు టీమిండియా.. షెడ్యూల్ విడుదల | India-Zimbabwe T20I series dates and venue revealed | Sakshi
Sakshi News home page

IND vs ZIM: జింబాబ్వే టూర్‌కు టీమిండియా.. షెడ్యూల్ విడుదల

Apr 1 2026 2:15 PM | Updated on Apr 1 2026 2:25 PM

India-Zimbabwe T20I series dates and venue revealed

ఐపీఎల్‌-2026 సీజన్ తర్వాత టీమిండియా వరుస సిరీస్‌లతో బీజీబీజీగా గడపనుంది. తొలుత జూన్‌లో అఫ్గానిస్తాన్‌తో ఏకైక టెస్టు, మూడు వన్డేల సిరీస్‌లో భారత్ తలపడనుంది. ఈ సిరీస్‌లో స్వదేశంలోనే జరగనుంది. అనంతరం ఐర్లాండ్ టూర్‌లో భాగంగా రెండు టీ20లు టీమిండియా ఆడనుంది.

మెన్ ఇన్ బ్లూ అటు నుంచి అటు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఇంగ్లీష్ జట్టుతో ఐదు టీ20లు , మూడు వన్డేల సిరీస్‌లో భారత్ ఆడనుంది. భారత జట్టు ఇంగ్లండ్ పర్యటన జూలై 1న మొదలై జూలై 19తో ముగియనుంది. అయితే అక్కడికి మూడు రోజుల తర్వాత టీమిండియా మూడు టీ20ల సిరీస్ కోసం జింబాబ్వేలో పర్యటించనుంది.

తాజాగా ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను జింబాబ్వే క్రికెట్ విడుదల చేసింది. భారత్‌-జింబాబ్వే మధ్య మూడు టీ20ల సిరీస్  కేవలం నాలుగు రోజుల వ్యవధిలో జరగనుంది. జూలై 23న ప్రారంభమై జూలై 26తో ముగిస్తుంది. అన్ని మ్యాచ్‌లు హరారే వేదికగా జింబాబ్వే వేదికగానే జరగనున్నాయి.భారత్‌, జింబాబ్వే మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరగనుండడం 2024 తర్వాత ఇదే తొలిసారి.

అయితే వరుస సిరీస్‌ల నేపథ్యంలో సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి, ఐపీఎల్‌లో రాణించిన యువ ఆటగాళ్లను జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కేవలం 15 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం చేసే సూచనలు కన్పిస్తున్నాయి.

భారత్‌-జింబాబ్వే టీ20 సిరీస్‌ షెడ్యూల్‌
మొదటి టీ20: జూలై 23

రెండో టీ20: జూలై 25

మూడో టీ20: జూలై 26
చదవండి: NZ vs SA: చ‌రిత్ర సృష్టించిన న్యూజిలాండ్‌.. ప్రపంచంలోనే తొలి జట్టుగా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement