Shikhar Dhawan: మాకిది గుణపాఠం.. కనీసం అక్కడైనా వాతావరణం అనుకూలిస్తే! చాల్లే ఆపు గబ్బర్‌..

Ind Vs NZ Losing Captain Dhawan: Hopefully Weather Better In Bangladesh - Sakshi

India tour of New Zealand, 2022- New Zealand vs India, 3rd ODI: టీమిండియా వన్డే సారథిగా వెస్టిండీస్‌ గడ్డపై చరిత్ర సృష్టించిన వెటరన్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌కు న్యూజిలాండ్‌ పర్యటన కలిసిరాలేదు. ముఖ్యంగా వాతావరణం అస్సలు అనుకూలించలేదు. మొదటి వన్డేలో భారీ స్కోరు చేసినప్పటికీ ఆతిథ్య జట్టు చేతిలో ధావన్‌ సేన ఓటమి పాలైన విషయం తెలిసిందే.

ఇక వర్షం కారణంగా రెండో వన్డే.. తాజాగా బుధవారం నాటి ఆఖరి మ్యాచ్‌ కూడా రద్దైంది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-0 తేడాతో విలియమ్సన్‌ బృందం సొంతం చేసుకుంది. కాగా కివీస్‌ పర్యటన తర్వాత భారత జట్టు బంగ్లాదేశ్‌ పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే.

పాఠాలు నేర్చుకుంటాం
ఈ నేపథ్యంలో ‍క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన మూడో వన్డే అనంతరం తాత్కాలిక కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఈ పర్యటనలో పూర్తిగా యువ జట్టుతో బరిలోకి దిగాము. బౌలింగ్‌ విభాగంలో వైఫల్యాలు యువ ఆటగాళ్లకు పాఠం లాంటివి.

కనీసం అక్కడైనా
ఇక ఈ సిరీస్‌ తర్వాత మేము బంగ్లాదేశ్‌కు వెళ్తున్నాం. కనీసం అక్కడైనా వాతావరణం అనుకూలిస్తే బాగుండు. బంగ్లాలో సీనియర్‌ జట్టు ఆడనుంది. ఇక్కడ జరిగిన తప్పులు మాకు గుణపాఠాల్లాంటివి. ఇక వన్డే వరల్డ్‌కప్‌ సమీపిస్తున్న తరుణంలో ఆసియా పిచ్‌ల మీద ఆడనుండటం మాకు మేలు చేకూరుస్తుంది. తప్పిదాలు సరిదిద్దుకుని ముందడుగు వేస్తాం’’ అని గబ్బర్‌ చెప్పుకొచ్చాడు. కాగా డిసెంబరు 4 నుంచి టీమిండియా- బంగ్లాదేశ్‌ మధ్య వన్డే సిరీస్‌ ఆరంభం కానుంది.

(చదవండి: Ban Vs Ind 2022: టీమిండియా బంగ్లాదేశ్‌ పర్యటన.. పూర్తి షెడ్యూల్‌, లైవ్‌ స్ట్రీమింగ్‌, ఇతర వివరాలు)

బాగానే వెనకేసుకొచ్చావులే!
కాగా రోహిత్‌ శర్మ గైర్హాజరీలో ధావన్‌ భారత జట్టు వన్డే సారథిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక కివీస్‌ పర్యటనలో హార్దిక్‌ పాండ్యా సారథ్యంలోని టీమిండియా టీ20 సిరీస్‌ ట్రోఫీని గెలిచింది. ఇక మూడో వన్డేలో 18 ఓవర్లలో కివీస్‌ వికెట్‌ నష్టానికి 104 పరుగులు చేయడంతో ధావన్‌ వ్యాఖ్యలపై నెటిజన్లు తమదైన శైలిలో కౌంటర్లు వేస్తున్నారు.

‘‘చాల్లే ఆపు.. బౌలర్లను బాగానే వెనకేసుకొచ్చావు.. వర్షం ఆగినా లాభం ఉండేది కాదేమో గబ్బర్‌! మొదటి మ్యాచ్‌లో ఏం జరిగిందో చూశాం కదా! అప్పుడు భారీ స్కోరు చేసినా కాపాడలేకపోయారన్న విషయం గుర్తుందా? ఇప్పుడు బ్యాటర్లు కూడా చేతులెత్తేశారు. నిజానికి వర్షం మనల్ని కాపాడింది’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

న్యూజిలాండ్‌ వర్సెస్‌ ఇండియా మూడో వన్డే స్కోర్లు:
టీమిండియా- 219 (47.3 ఓవర్లలో)
వర్షం ఆరంభమయ్యే సమయానికి న్యూజిలాండ్‌ స్కోరు: 104/1 (18)
వరణుడి కారణంగా ఫలితం తేలకుండా ముగిసిన మ్యాచ్‌

చదవండి: టీమిండియాకు వెలకట్టలేని ఆస్తి దొరికింది! జడ్డూ నువ్వు రాజకీయాలు చూసుకో! ఇక నీ అవసరం ఉండకపోవచ్చు!
IND VS NZ 3rd ODI: చెత్త ఫామ్‌పై ప్రశ్న.. సహనం కోల్పోయిన పంత్‌
VHT 2022: మరోసారి విధ్వంసం సృష్టించిన రుతురాజ్‌.. ఈసారి భారీ శతకంతో..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top