IND VS NZ 2nd Test: కివీస్‌ చేతిలో టీమిండియా ఓటమి | IND Vs NZ 2nd Test: Team India In Deep Trouble, Lost 5 Wickets For 147 Runs, Check Score Details Inside | Sakshi
Sakshi News home page

IND VS NZ 2nd Test: కివీస్‌ చేతిలో టీమిండియా ఓటమి

Oct 26 2024 1:42 PM | Updated on Oct 26 2024 4:00 PM

IND VS NZ 2nd Test: India In Deep Trouble, Lost 5 Wickets For 147 Runs

అప్‌డేట్‌:
న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో టీమిండియా 113 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

టీ విరామ సమయానికి టీమిండియాస్కోరు: 178-7(40 ఓవర్లలో). విజయానికి ఇంకా 181 పరుగుల దూరంలో ఉంది.

పూణే వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 359 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్‌ 147 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగుతుంది. 

భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్‌ (77) రాణించగా.. రోహిత్‌ శర్మ (8), శుభ్‌మన్‌ గిల్‌ (23), విరాట్‌ కోహ్లి (17), రిషబ్‌ పంత్‌ (0) విఫలమయ్యారు. వాషింగ్టన్‌ సుందర్‌ (21), సర్ఫరాజ్‌ ఖాన్‌ (9)  కూడా నిరాశపరిచారు. ఈ మ్యాచ్‌లో భారత్‌ గెలవాలంటే మరో 181 పరుగులు చేయాల్సి ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో (7/59) భారత్‌ను దెబ్బకొట్టిన మిచెల్‌ సాంట్నర్‌ ఈ ఇన్నింగ్స్‌లోనూ (4/49) కష్టాల్లోకి నెట్టాడు.

అంతకుముందు న్యూజిలాండ్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 255 పరుగులకు ఆలౌటైంది. టామ్‌ లాథమ్‌ అర్ద సెంచరీతో (86) రాణించగా.. టామ్‌ బ్లండెల్‌ (41), గ్లెన్‌ ఫిలిప్స్‌ (48 నాటౌట్‌) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో వాషింగ్టన్‌ సుందర్‌ 4, రవీంద్ర జడేజా 3, అశ్విన్‌ 2 వికెట్లు పడగొట్టారు.

దీనికి ముందు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 156 పరుగులకు ఆలౌటైంది. మిచెల్‌ సాంట్నర్‌ ఏడు వికెట్లు తీసి టీమిండియా పతనాన్ని శాశించాడు. గ్లెన్‌ ఫిలిప్స్‌ 2, సౌతీ ఓ వికెట్‌ పడగొట్టారు. భారత ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా (38) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. యశస్వి, గిల్‌ చెరో 30 పరుగులు చేశారు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులకు ఆలౌటైంది. వాషింగ్టన్‌ సుందర్‌ ఏడు వికెట్లతో చెలరేగి కివీస్‌ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చాడు. అశ్విన్‌ మూడు వికెట్లు పడగొట్టాడు. కివీస్‌ ఇన్నింగ్స్‌లో కాన్వే (76), రచిన్‌ రవీంద్ర (65) అర్ద సెంచరీలతో రాణించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement