T20 WC 2022: రోహిత్‌ను కెప్టెన్‌గా తప్పించండి! వాళ్లలో ఒకరిని సారథి చేయండి

Ian Bishop on Indias approach after T20 World Cup exit - Sakshi

టీ20 ప్రపంచకప్‌-2022లో సెమీస్‌లోనే టీమిండియా ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే. హాట్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన భారత్‌.. సెమీఫైన్లలో ఇంగ్లండ్‌ చేతిలో ఘోర ఓటమిని చవిచూసింది. ముఖ్యంగా ఈ టోర్నీలో భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తీవ్ర నిరాశ పరిచాడు. ఈ మెగా ఈవెంట్‌లో ఆరు మ్యాచ్‌లు ఆడిన రోహిత్‌ కేవలం 116 పరుగులు మాత్రమే చేశాడు.

అదే విధంగా కెప్టెన్సీ పరంగా అంతగా వ్యూహాలు రచించడంలో విఫలమయ్యాడు. ఈ క్రమంలో రాబోయే టీ20 ప్రప‍ంచకప్‌కు ముందు రోహిత్‌ను తప్పించి కెప్టెన్సీ బాధ్యతలు హార్దిక్‌ అప్పజెప్పాలని డిమాండ్స్‌ వినిపిస్తున్నాయి. ఇక తాజాగా ఇదే విషయంపై వెస్టిండీస్‌ దిగ్గజం ఇయాన్‌ బిషఫప్‌ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. రోహిత్ శర్మ  అన్ని ఫార్మాట్‌లలో కెప్టెన్సీ భారాన్ని మోయలేకపోతున్నాడని బిషఫ్‌ అన్నాడు.

స్టార్‌ స్పోర్ట్స్‌తో బిషప్‌ మాట్లాడుతూ.. "ఈ ఏడాది జూలైలో విండీస్‌తో సిరీస్‌ సమయంలో రోహిత్‌ను ఓ ప్రశ్న ఆడిగాను. మూడు ఫార్మాట్‌లలో కెప్టెన్సీ భారాన్ని మేనేజ్‌ చేయగలవా? అతడు దానికి బదులుగా అది చాలా కష్టం అని సమాధానం చెప్పాడు. మూడు ఫార్మాట్‌ల్లో కెప్టెన్‌గా బాధ్యతలు నిర్హహించడం అంత సులభం కాదు.

అది వ్యక్తిగత ఆటపై ప్రభావం చూపుతోంది. రోహిత్‌ విషయంలో కూడా ఇదే జరిగింది. మరో రెండేళ్లలో టీ20 ప్రపంచకప్‌ జరగనుంది. రోహిత్‌ వయస్సు దృష్ట్యా అతడి స్థానంలో కొత్త సారథిని భారత్‌ తయారు చేసుకుంటే బాగుటుంది. నాకు అడిగితే రిషబ్ పంత్ లేదా హార్ధిక్ పాండ్యా, శ్రేయాస్ అయ్యర్‌లకు టీమిండియా కెప్టెన్సీ అప్పగిస్తే బెటర్" అని అతడు పేర్కొన్నాడు.
చదవండిIND vs NZ: భారత్‌తో టీ20 సిరీస్‌.. న్యూజిలాండ్‌ కెప్టెన్‌ దూరం! స్టార్‌ బౌలర్‌ కూడా!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top