ధోని, సచిన్‌లు నన్ను నిరాశపరిచారు: శశిథరూర్‌

I was Upset With Dhoni,Tendulkar For Refusing DRS, Shashi Tharoor - Sakshi

వారికి డీఆర్‌ఎస్‌ అంటే ఎందుకంత ఎలెర్జీ?

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్లు‌ సచిన్‌ టెండూల్కర్‌, ఎంఎస్‌ ధోనిలు తనను ఒక విషయంలో తీవ్రంగా నిరాశపరిచారంటున్నారు కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ శశిథరూర్‌. వీరిద్దరూ ఆటపరంగా పక్కన పెడితే, అంపైర్‌ నిర్ణయ సమీక్ష పద్ధతిని ప్రవేశపెట్టిన సమయంలో వ్యతిరేకించడం తనను అసంతృప్తిగా గురి చేసిందన్నారు. టెక్నాలజీకి తాను అతిపెద్ద అభిమానిననే విషయాన్ని ఈ సందర్భంగా శశిథరూర్‌ పేర్కొన్నారు. ‘ నేను టెక్నాలజీకి ఎప్పుడూ పెద్ద పీట వేస్తా. డీఆర్‌ఎస్‌ను ప్రవేశపెట్టిన తొలినాళ్ల నుంచి దానికి అడ్వోకేట్‌గా ఉన్నా. కానీ సచిన్‌, ధోనిలు డీఆర్‌ఎస్‌ను ప్రవేశపెట్టిన ఆరంభంలో వ్యతిరేకించారు. ఇది నన్ను తీవ్రంగా నిరూత్సాహపరిచింది. నేను క్రికెట్‌ను రెగ్యులర్‌గా చూస్తూ ఉంటా. డీఆర్‌ఎస్‌ వచ్చిన కొత్తలో మనవాళ్లు అంపైర్ల నిర్ణయాన్ని జీర్ణించుకోవడం కష్టంగా ఉండేది. (చదవండి: సీఎస్‌కే వాట్సాప్‌ గ్రూప్‌ నుంచి రైనా ఔట్‌?)

వారికి డీఆర్‌ఎస్‌ అంటే ఎందుకంత ఎలెర్జీనో నాకైతే ఇప్పటివరకూ తెలీదు. డీఆర్‌ఎస్‌ అనేది క్రికెట్‌లో తీసుకొచ్చిన అతిపెద్ద సవరణ. ఇక డీఆర్‌ఎస్‌ లేకుండా అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌లు చూడటం అనేది ఉండదనే అనుకుంటున్నా. డీఆర్‌ఎస్‌తో ఫీల్డ్‌లో అంపైర్లు తీసుకునే కొన్ని తప్పుడు నిర్ణయాలకు జవాబు దొరకుతుంది. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. డీఆర్‌ఎస్‌ ఎన్నో అదనపు ప్రయోజనాలు ఉన్నాయి. ఇది క్రికెట్‌లో సరికొత్త శకానికి నాంది’ అని స్పోర్ట్స్‌కీడాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శశిథరూర్‌ పేర్కొన్నారు.2008లో భారత్‌-శ్రీలంక జట్ల మధ్య జరిగిన టెస్టు సిరీస్‌ ద్వారా డీఆర్‌ఎస్‌ను ప్రయోగించారు. అయితే దీన్ని అప్పట్లో  టీమిండియా బాగా వ్యతిరేకించింది. అందులోని లోటుపాట్లను ధోని, సచిన్‌లు బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లడంతో దాన్ని వ్యతిరేకించకతప్పలేదు. కాగా, 2016లో భారత పర్యటనకు ఇంగ్లండ్‌ వచ్చిన సమయంలో డీఆర్‌ఎస్‌కు ఎట్టకేలకు బీసీసీఐ ఓకే చెప్పింది. (చదవండి: ‘సచిన్‌ను మర్చిపోతారన్నాడు’)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top