రాబిన్ ఉతప్ప(ఫైల్ ఫోటో)
హాంకాంగ్ క్రికెట్ సిక్సెస్-2025 (Hong Kong Sixes) టోర్నీలో పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత ఓపెనర్ రాబిన్ ఊతప్ప మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ నుంచే పాక్ బౌలర్లను టార్గెట్ చేశాడు. ఈ వెటరన్ క్రికెటర్ కేవలం 11 బంతుల్లోనే 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 28 పరుగులు చేసి ఔటయ్యాడు.
అతడితో పాటు కెప్టెన్ దినేష్ కార్తీక్, భరత్ చిప్లి కూడా బ్యాట్‌ను ఝూళిపించారు. భరత్ 13 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 24 పరుగులు చేయగా.. కార్తీక్ కేవలం 6 బంతుల్లోనే 17 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. ఫలితంగా మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 6 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది. కాగా ఈ టోర్నీలో పాకిస్తాన్ తమ తొలి మ్యాచ్‌లో కువైట్‌పై ఘన విజయం సాధించింది.
కువైట్ నిర్ధేశించిన పాకిస్తాన్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. లక్ష్య చేధనలో పాక్ కెప్టెన్ అబ్బాస్ అఫ్రిది విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. అఫ్రిది కేవలం 12 బంతుల్లోనే 1 ఫోర్, 8 సిక్స్‌లతో 55 పరుగులు చేసి రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు. మరోవైపు అఫ్గానిస్తాన్ వరుసగా రెండు మ్యాచ్‌లలో విజయం సాధించింది.
చదవండి: పాకిస్తాన్ కెప్టెన్ విధ్వంసం.. 12 బంతుల్లో హాఫ్ సెంచరీ


