పాకిస్తాన్‌ కెప్టెన్‌ విధ్వంసం.. 12 బంతుల్లో హాఫ్‌ సెంచరీ | Abbas Afridi Smashes Six Sixes In An Over As Pakistan Beat Kuwait In Hong Kong Sixes 2025, Video Went Viral | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌ కెప్టెన్‌ విధ్వంసం.. 12 బంతుల్లో హాఫ్‌ సెంచరీ

Nov 7 2025 9:50 AM | Updated on Nov 7 2025 10:50 AM

Pakistan won by 4 wickets against Kuwait in Hong Kong Sixes

హాంకాంగ్‌ క్రికెట్‌ సిక్సెస్‌-2025 (Hong Kong Sixes) టోర్న‌మెంట్‌లో పాకిస్తాన్ శుభారంభం చేసింది. శుక్రవారం  మోంగ్‌ కాక్‌ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో కువైట్‌పై 4 వికెట్ల తేడాతో పాక్‌ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన కువైట్‌ నిర్ణీత 6 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 123 పరుగుల భారీ చేసింది.

కువైట్‌ ఇన్నింగ్స్‌లో   భావ్‌సర్‌(14 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 40) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. బిలాల్‌ తహిర్‌(6 బంతుల్లో 24), ఉస్మాన్‌ పటేల్‌(9 బంతుల్లో31) మెరుపులు మెరిపించారు. పాక్‌ బౌలర్లలో మాజ్ సదఖత్, అబ్బాస్‌ అఫ్రిది తలా వికెట్‌ సాధించారు.

అఫ్రిది విధ్వంసం..
అనంతరం 124 పరుగుల భారీ లక్ష్యాన్ని పాకిస్తాన్‌ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఆఖరి బంతికి చేధించింది. లక్ష్య చేధనలో పాక్‌ కెప్టెన్‌  అబ్బాస్‌ అఫ్రిది ఆకాశమే హద్దుగా చెలరేగాడు. నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అఫ్రిది.. ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు.

ఈ క్రమంలో పాక్‌ ఇన్నింగ్స్‌ 5వ ఓవర్‌ వేసిన కువైట్‌ స్పిన్నర్‌ యాసిన్‌ పటేల్‌ బౌలింగ్‌లో అఫ్రిది.. వరుసగా ఆరు సిక్సర్లు బాదాడు. తొలి బంతిని స్ట్రైట్‌ డ్రైవ్‌ ఆడి సిక్సర్‌గా మలిచిన అఫ్రిది.. ఆ తర్వాత బంతిని లాంగ్‌ ఆన్‌ మీదగా స్టాండ్స్‌కు తరలించాడు.

అనంతరం మూడు, నాలుగు బంతులను డీప్‌ మిడ్‌ వికెట్‌ మీదగా భారీ సిక్సర్లు బాదాడు. చివరి రెండు బంతులను లాంగ్‌ ఆఫ్‌, ఫైన్‌ లెగ్‌ మీదగా ఆడి సిక్సర్లు రాబట్టాడు. అఫ్రిది కేవలం 12 బంతుల్లోనే 1 ఫోర్‌, 8 సిక్స్‌లతో 55 పరుగులు చేసి రిటైర్డ్‌ హార్ట్‌గా వెనుదిరిగాడు.


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement