మౌంట్ మౌంగనుయ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్( Harry Brook) విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు కివీస్ బౌలర్లు భారీ షాకిచ్చారు.
బ్లాక్ క్యాప్స్ బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ కేవలం 34 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో హ్యారీ బ్రూక్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ జేమి ఓవర్టన్‌తో కలిసి కివీస్ బౌలర్లను ఎటాక్ చేశాడు. ఓవర్టన్‌తో కలిసి ఆరో వికెట్‌కు బ్రూక్ 87 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
ఆ తర్వాత క్రమం తప్పకుండా వికెట్లు పడతున్నప్పటికి ఇంగ్లీష్ జట్టు కెప్టెన్ మాత్రం తన విధ్వంసాన్ని మాత్రం ఆపలేదు. మౌంట్ మౌంగనుయ్‌లో బౌండరీల వర్షం కురిపించాడు. అతడు మెరుపు బ్యాటింగ్ ఫలితంగా ఇంగ్లండ్ 35.2 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌటైంది.
ఓవరాల్‌గా 135 బంతులు ఎదుర్కొన్న బ్రూక్..9 ఫోర్లు, 11 సిక్స్‌లతో 135 పరుగులు చేశాడు. ఆఖరి వికెట్‌గా బ్రూక్‌నే వెనుదిరిగాడు. కివీస్ బౌలర్లలో జకారీ ఫౌల్క్స్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. డఫీ మూడు, హెన్రీ రెండు వికెట్లు పడగొట్టారు. స్వల్ప లక్ష్య చేధనలో కివీస్ సైతం తడబడుతోంది. 66 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
చదవండి: రోహిత్ శర్మ రిటైర్మెంట్ అప్పుడే.. కన్ఫర్మ్ చేసిన కోచ్
🚨One of the most iconic knocks by Harry Brook🤯
England were 10/4 in 5 overs, and Captain Harry Brook stood tall, smashing 135 off 101 balls with 9 fours and 11 sixes.
He single-handedly took England to a fighting total of 223 against New Zealand. 🔥#HarryBrook #ENGvNZ pic.twitter.com/5Nn4mHJbUd— ICC Asia Cricket (@ICCAsiaCricket) October 26, 2025


