మహిళల విభాగంలో సవితా పూనియాకు అవార్డు

Hardik Singh And Savita Punia Won Hockey India Player Of Year Awards - Sakshi

భారత హాకీ సమాఖ్య (హెచ్‌ఐ) 2022 సంవత్సరానికిగాను భారత జట్టుకు సంబంధించి వార్షిక అవార్డులను ప్రకటించింది. పురుషుల విభాగంలో మిడ్‌ఫీల్డర్‌ హార్దిక్‌ సింగ్, మహిళల విభాగంలో సవితా పూనియా హాకీ ఇండియా ఉత్తమ ఆటగాళ్లుగా నిలిచారు. ఒడిషాలో జరిగిన హాకీ ప్రపంచకప్‌లో హార్దిక్‌ అద్భుత ఆటతీరు కనబర్చాడు. ఎఫ్‌ఐహెచ్‌ ఉమెన్స్‌ నేషనల్‌ కప్‌ టైటిల్‌ గెలిపించి ప్రొ లీగ్‌కు భారత జట్టు అర్హత సాధించడంలో కీపర్‌గా, కెప్టెన్‌గా సవిత కీలక పాత్ర పోషించింది.

ఇద్దరికీ హాకీ ఇండియా తరఫున రూ. 25 లక్షల చొప్పున నగదు పురస్కారం లభించింది. శుక్రవారం జరిగిన కార్యక్రమంలో వీటిని అందజేశారు. దీంతో పాటు 2021కు సంబంధించిన అవార్డులను కూడా ప్రకటించగా హర్మన్‌ప్రీత్, సవితా పూనియా అత్యుత్తమ ఆటగాళ్లుగా అవార్డులు అందుకున్నారు. 2022లో సుల్తాన్‌ జొహర్‌ కప్‌ గెలిచిన భారత జూనియర్‌ జట్టును కూడా ఈ సందర్భంగా సత్కరించారు.    

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top