గాయాలతో సతమతం.. ఆటకు గుడ్‌బై | Gurjant Singh Retires From International Hockey After Injury Layoff | Sakshi
Sakshi News home page

గాయాలతో సతమతం.. ఆటకు గుడ్‌బై

Mar 28 2026 7:03 AM | Updated on Mar 28 2026 12:37 PM

Gurjant Singh Retires From International Hockey After Injury Layoff

న్యూఢిల్లీ: గత కొంత కాలంగా గాయాలతో ఇబ్బంది పడుతున్న భారత హాకీ ఆటగాడు గుర్జంత్‌ సింగ్‌ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. 2020 టోక్యో, 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాలు సాధించిన భారత పురుషుల హాకీ జట్టులో సభ్యుడైన గుర్జంత్‌... కెరీర్‌లో 130 మ్యాచ్‌లు ఆడాడు. పంజాబ్‌కు చెందిన 31 ఏళ్ల గుర్జంత్‌ 2023 ఆసియా క్రీడల్లో భారత జట్టు పసిడి నెగ్గడంలో కీలక పాత్ర పోషించాడు.  

2017లో జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేసిన అతను కెరీర్‌ మొత్తంలో 33 గోల్స్‌ చేశాడు. భారత్‌ తరఫున అత్యంత వేగవంతమైన గోల్‌ చేసిన ప్లేయర్‌గానూ రికార్డు సృష్టించాడు. 2020లో ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ లీగ్‌లో భాగంగా నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో గుర్జంత్‌ 13 సెకన్లలోనే గోల్‌ నమోదు చేశాడు. 

హాకీ ఇండియా వార్షిక అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా గుర్జంత్‌ తన నిర్ణయాన్ని వెల్లడించాడు. ‘ఇదే సరైన సమయం అనుకుంటున్నా. గత కొంత కాలంగా గాయాలతో సతమతమవుతున్నా. కోలుకొని తిరిగి వచ్చినా... జాతీయ జట్టులో చోటు దక్కించుకోలేకపోయా. కెరీర్‌లో సాధించిన దానితో సంతృప్తిగా వీడ్కోలు పలుకుతున్నా. ఇక మీద దేశవాళీలు, హాకీ ఇండియా లీగ్‌లో ఆడుతా’ అని గుర్జంత్‌ వెల్లడించాడు.   

చదవండి: విండీస్‌ క్రికెటర్‌ సంచలన నిర్ణయం!

Advertisement
 
Advertisement
Advertisement