విండీస్‌ క్రికెటర్‌ సంచలన నిర్ణయం! | West Indies Cricketer Evin Lewis Reverses International Retirement | Sakshi
Sakshi News home page

Evin Lewis: విండీస్‌ క్రికెటర్‌ సంచలన నిర్ణయం!

Mar 27 2026 12:15 PM | Updated on Mar 27 2026 12:47 PM

West Indies Cricketer Evin Lewis Reverses International Retirement

వెస్టిండీస్ సీనియర్ బ్యాటర్ ఎవిన్ లూయిస్ తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఈ ఏడాది జనవరిలో టీ20 ప్రపంచకప్‌కు ప్రకటించిన వెస్టిండీస్ జట్టులో ఎవిన్ లూయిస్‌కు చోటు దక్కలేదు. దీంతో 34 ఏళ్ల ఎవిన్ లూయిస్ ఉన్నపళంగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతూ నిర్ణయాన్ని వెల్లడించాడు. 

అయితే తాజాగా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించిన లూయిస్ ట్రినిడాడ్ అండ్ టొబాగో జట్టు తరఫున నాలుగు రోజుల  ప్రాక్టీస్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. త‌న కెరీర్‌లో కేవ‌లం వైట్‌బాల్ క్రికెట్ (వ‌న్డే, టీ20 ఫార్మాట్‌)కే ప‌రిమిత‌మైన లూయిస్ తాజాగా తొమ్మిదేళ్ల తర్వాత రెడ్‌బాల్ క్రికెట్ (టెస్టు ఫార్మాట్‌)లోనూ తాను ఆడాలనుకుంటున్న‌ట్లు మ‌న‌సులోని మాట‌ను బయటపెట్టాడు. 

అయితే ఫ‌స్ట్‌క్లాస్ కెరీర్‌లో ట్రినిడాడ్ అండ్ టొబాగో త‌ర‌ఫున ఎవిన్ లూయిస్ 22 మ్యాచ్‌ల్లో 1,229 ప‌రుగులు సాధించాడు. 2016లో అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన ఎవిన్ లూయిస్ 67 వ‌న్డేల్లో 2,175 ప‌రుగులు చేశాడు. 65 టీ20 మ్యాచ్‌ల్లో 1,782 ప‌రుగులు సాధించాడు. ఇందులో వ‌న్డేల్లో 5 శ‌త‌కాలు, టీ20ల్లో రెండు సెంచ‌రీలు సాధించాడు.  

2016 టీ20 ప్ర‌పంచ‌క‌ప్ గెలిచిన విండీస్ జ‌ట్టులో ఎవిన్ లూయిస్ స‌భ్యుడిగా ఉన్నాడు. అంతేకాదు అంతర్జాతీయ క్రికెట్‌లో 176 ప‌రుగుల వ‌ద్ద రిటైర్డ్ హ‌ర్ట్ అయిన క్రికెట‌ర్‌గా లూయిస్ రికార్డుల‌కెక్కాడు. ఇక అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో విండీస్ త‌ర‌ఫున అత్య‌ధిక స్కోరు (125 నాటౌట్‌) సాధించిన ఆట‌గాడిగాను రికార్డును త‌న పేరిట లిఖించుకున్నాడు.

చదవండి:  సంచ‌ల‌నాల సూర్య‌వంశీ! 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement