ఐపీఎల్ 2026 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ క్వాలిఫయర్-1 పోరులో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఆర్సీబీ విధించిన 255 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో గుజరాత్ 162 పరుగులకే కుప్పకూలింది. రాహుల్ తెవాటియా మినహా మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో గుజరాత్ టైటాన్స్‌కు ఓటమి తప్పలేదు. మ్యాచ్ ఓటమి అనంతరం గుజరాత్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ మీడియా సమావేశానికి వచ్చాడు.
ఈ సమయంలో అక్కడ ఉన్న రిపోర్టర్లలో ఒక వ్యక్తి తన ప్రశ్నలతో గ్లెన్ ఫిలిప్స్‌కు చిర్రెత్తుకొచ్చేలా చేశాడు. 'ఆర్సీబీ విధించిన 255 పరుగుల భారీ లక్ష్యాన్ని చూసినప్పుడే మీ మైండ్‌లో ఓటమి భయం మొదలైందనుకుంటా' అని ప్రశ్నించాడు. రిపోర్టర్ వేసిన ప్రశ్నకు ఆశ్చర్యపోయిన ఫిలిప్స్ ఆ తర్వాత సదరు రిపోర్టర్‌కు ధీటుగా బదులిచ్చాడు.
'ఇదొక దిక్కుమాలిన ప్రశ్న. ప్రొఫెషనల్ క్రికెటర్లు ఎప్పుడు లక్ష్యం గురించి ఆలోచించరు. మ్యాచ్‌లో టార్గెట్ ఎంత ఉన్నప్పటికీ పరుగులు చేయడానికే ప్రయత్నిస్తారు. ఇలాంటి పిచ్చి ప్రశ్నలను మదిలోకి రానివ్వరు. మీరు వేసిన ప్రశ్న చాలా ఘోరంగా ఉంది. ఐపీఎల్ ఇంతకుమించి టార్గెట్‌లు ఛేదించిన సందర్భాలు ఉన్నాయన్న సంగతి మరిచిపోయారా?
అయితే భారీ లక్ష్యం కళ్ల ముందు ఉన్నప్పుడు ఒత్తిడి ఉండడం సహజం. ఆ ఒత్తిడిలో ఒక్కోసారి విజయం సాధించలేకపోవచ్చు. అని చెప్పుకొచ్చాడు. మ్యాచ్ విషయానికొస్తే.. మంగళవారం ఏకపక్షంగా సాగిన క్వాలిఫయర్–1లో ఆర్‌సీబీ 92 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్‌ను చిత్తు చేసింది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. అనంతరం గుజరాత్ 19.3 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటైంది. ఓడినా గుజరాత్ ఫైనల్ చేరేందుకు మరో అవకాశం మిగిలి ఉంది. బుధవారం జరిగే ‘ఎలిమినేటర్’ మ్యాచ్ విజేతతో శుక్రవారం జరిగే క్వాలిఫయర్–2లో గుజరాత్ జట్టు తలపడుతుంది.
చదవండి: ఏడాదికి రెండుసార్లు ఐపీఎల్.. అరుణ్ ధుమాల్ క్లారిటీ!


