
ఆసియా కప్ 2025 కోసం టోర్నీ బ్రాడ్‌కాస్టర్ సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ బహుభాషా కామెంటరీ ప్యానెల్‌ను ప్రకటించింది. ఈ ప్యానెల్‌లో వరల్డ్ ఫీడ్ (ఇంగ్లీష్) అందించడానికి సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి, సంజయ్ మంజ్రేకర్, రాబిన్ ఉతప్ప, వకార్ యూనిస్, వసీం అక్రమ్, బాజిద్ ఖాన్, రస్సెల్ ఆర్నాల్డ్, సైమన్ డౌల్ ఎంపిక చేయబడ్డారు.
హిందీ ప్యానెల్‌లో వీరేంద్ర సెహ్వాగ్, ఇర్ఫాన్ పఠాన్, అజయ్ జడేజా, అభిషేక్ నాయర్, సబా కరీమ్ సభ్యులుగా ఉన్నారు. తమిళ ప్యానెల్‌లో భరత్ అరుణ్, WV రామన్.. తెలుగు వ్యాఖ్యాతలుగా వెంకటపతి రాజు, వేణుగోపాల్ రావు తదితరులు వ్యవహరిస్తారు.
ప్రత్యేక ఆకర్షణగా వీరూ
కామెంటరీ ప్యానెల్ మొత్తంలో భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాడు. సెహ్వాగ్ తన స్పష్టమైన అభిప్రాయాలు, హాస్యంతో కూడిన వ్యాఖ్యానంతో అభిమానులను మంత్రముగ్దుల్ని చేస్తాడు. ఆటగాడిగా ఏరకంగా మెరుపులు మెరిపించాడో, వ్యాఖ్యానంతోనూ అలాగే కట్టిపడేస్తాడు.
కాగా, ఇవాల్టి నుంచే (సెప్టెంబర్ 9)ప్రారంభం కాబోయే ఆసియా కప్‌లో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ, ఆఫ్ఘానిస్తాన్, యూఏఈ, ఒమన్, హాంకాంగ్ జట్లు పోటీపడనున్నాయి. భారత్, పాకిస్తాన్, ఒమన్, యూఏఈ గ్రూప్-బిలో ఉండగా.. మిగతా జట్లు గ్రూప్-ఏలో ఉన్నాయి.
ఇవాళ జరుగబోయే మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్, హాంగ్‌కాంగ్ తలపడనున్నాయి. భారత్ తమ తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 10న UAEతో ఆడనుంది. ఈ టోర్నీ మొత్తంలో ప్రత్యేక మ్యాచైన భారత్-పాకిస్తాన్ మ్యాచ్ సెప్టెంబర్ 14న జరుగనుంది.
ఈ టోర్నీలో భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహిస్తున్నాడు. జట్టులో శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా, సంజు శాంసన్, జస్ప్రీత్ బుమ్రా లాంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు.