FIFA World Cup: ఆ జట్ల మధ్యే తొలి పోరు.. ఏయే గ్రూపులో ఏ జట్లు అంటే!

FIFA World Cup Qatar 2022 Draw Groups And Schedule Released - Sakshi

FIFA World Cup- దోహా: ఈ ఏడాది నవంబర్‌ 21 నుంచి డిసెంబర్‌ 18 వరకు జరిగే ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ టోర్నమెంట్‌ ‘డ్రా’ శుక్రవారం విడుదలైంది. ఆతిథ్య దేశం ఖతర్, ఈక్వెడార్‌ జట్ల మధ్య మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్‌ ప్రారంభంకానుంది. తొలి రోజు నాలుగు మ్యాచ్‌లు ఉంటాయి. మొత్తం 32 జట్లను ఎనిమిది గ్రూప్‌లుగా విభజించారు.

ఇప్పటికి 29 జట్లు అర్హత పొందగా... మిగతా మూడు జట్లు ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌ల ద్వారా ఖరారవుతాయి. ప్లే ఆఫ్స్‌లో పోటీపడనున్న జట్లకూ ‘డ్రా’లో చోటు కల్పించారు. గ్రూప్‌ల వివరాలు ఇలా ఉన్నాయి. 

గ్రూప్‌ ‘ఎ’: ఖతర్, ఈక్వెడార్, నెదర్లాండ్స్, సెనెగల్‌. 
గ్రూప్‌ ‘బి’: ఇంగ్లండ్, ఇరాన్, అమెరికా, స్కాట్లాండ్‌ /వేల్స్‌/ఉక్రెయిన్‌.
గ్రూప్‌ ‘సి’: అర్జెంటీనా, సౌదీ అరేబియా, మెక్సికో, పోలాండ్‌.
గ్రూప్‌ ‘డి’: ఫ్రాన్స్, డెన్మార్క్, ట్యునిషియా, యూఏఈ/ఆస్ట్రేలియా/ పెరూ.
గ్రూప్‌ ‘ఇ’: స్పెయిన్, జర్మనీ, జపాన్, కోస్టారికా/న్యూజిలాండ్‌.
గ్రూప్‌ ‘ఎఫ్‌’: బెల్జియం, కెనడా, మొరాకో, క్రొయేషియా.
గ్రూప్‌ ‘జి’: బ్రెజిల్, సెర్బియా, స్విట్జర్లాండ్, కామెరూన్‌. గ్రూప్‌ ‘హెచ్‌’: పోర్చుగల్, ఘనా, ఉరుగ్వే, కొరియా. 

చదవండి: IPL 2022: రసెల్‌ విధ్వంసం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top