CWG 2026: మనకే దెబ్బ!.. ఎందుకిలా చేశారు? | Explained: Why Hockey Cricket Dropped from CWG 2026 Impact on India Medals | Sakshi
Sakshi News home page

CWG 2026: మనకే దెబ్బ!.. ఎందుకిలా చేశారు?

Oct 22 2024 5:52 PM | Updated on Oct 22 2024 6:18 PM

Explained: Why Hockey Cricket Dropped from CWG 2026 Impact on India Medals

ప్రతిష్టాత్మక కామన్‌వెల్త్‌ గేమ్స్‌ నుంచి కీలక క్రీడాంశాలను ఎత్తివేసింది నిర్వాహక బృందం. 2026లో గ్లాస్గో వేదికగా జరుగనున్న ఈ మెగా ఈవెంట్‌ నుంచి క్రికెట్‌, హాకీ, షూటింగ్‌, టేబుల్‌ టెన్నిస్‌, స్క్వాష్‌, రోడ్‌ రేసింగ్‌, రెజ్లింగ్‌, బ్యాడ్మింటన్‌ తదితర క్రీడల్ని తొలగించారు. ఈ నేపథ్యంలో పతకాల పట్టికలో భారత్‌ వెనుకబడే అవకాశం ఉంది.

మనకే దెబ్బ! తీవ్ర ప్రభావం
ఎందుకంటే.. హాకీ, క్రికెట్‌(మహిళలు), బ్యాడ్మింటన్‌, రెజ్లింగ్‌, షూటింగ్‌లలోనే మనకు ఎక్కువ పతకాలు వస్తున్నాయి. ముఖ్యంగా షూటింగ్‌లో అత్యధికంగా ఇప్పటి వరకు 135 కామన్‌వెల్త్‌ మెడల్స్‌ గెలిచింది భారత్‌. ఇందులో 63 పసిడి పతకాలు ఉండటం విశేషం. మరోవైపు.. రెజ్లింగ్‌లోనూ వివిధ విభాగాల్లో 114 మెడల్స్‌ దక్కాయి.

బడ్జెట్‌ను తగ్గించుకోవడం కోసమే!
వచ్చే కామన్‌వెల్త్‌ గేమ్స్‌ నుంచి ఈ రెండింటిని తొలగించారు గనుక భారత్‌కు ఎదురుదెబ్బ తప్పకపోవచ్చు. అయితే, గ్లాస్గో ఆర్గనైజింగ్‌ కమిటీ ఈ మేర క్రీడల్ని తొలగించడానికి ప్రధాన కారణం బడ్జెట్‌ను తగ్గించుకోవడం కోసమే అని తెలుస్తోంది. గతంలో కామన్‌వెల్త్‌ గేమ్స్‌ చరిత్రలో అత్యధికంగా 10 క్రీడలు మాత్రమే నిర్వహించేవారు. అయితే, 1998 తర్వాత 15- 20 క్రీడలను అదనంగా చేర్చారు.

నాలుగు వేదికల్లోనే ఈవెంట్స్‌
అయితే, గ్లాస్గోలో పాత పద్ధతినే ఫాలో అయ్యేందుకు నిర్వాహకులు ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. తక్కువ క్రీడలు ఉంటే తక్కువ వేదికలు మాత్రమే అవసరమవుతాయి.. ఫలితంగా తక్కువ ఖర్చుతో మెగా ఈవెంట్‌ను పూర్తి చేయవచ్చని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈసారి కేవలం నాలుగు వేదికల్లోనే ఈవెంట్స్‌ నిర్వహించనున్నారు.

స్కాట్స్‌టౌన్‌ స్టేడియం, టోల్‌క్రాస్‌ ఇంటర్నేషనల్‌ స్విమ్మింగ్‌ సెంటర్‌, కామన్‌వెల్త్‌ ఎరీనా/సర్‌ క్రిస్‌ హోయ్‌ వెలడ్రోమ్‌, స్కాటిష్‌ ఈవెంట్స్‌ క్యాంపస్‌లను వేదికలుగా ఎంపిక చేశారు. అయితే, గ్లాస్గో ఆర్గనైజింగ్‌ కమిటీ తీసుకున్న నిర్ణయమే ఫైనల్‌ కాదు. భవిష్యత్తులో మరిన్ని క్రీడలను చేర్చే, తొలగించే వెసలుబాటు ఆతిథ్య దేశాల కమిటీలకు ఉంటుంది. తమ దేశ పరిస్థితులు, ఆర్థిక స్థితిగతులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే వీలుంది.  

గ్లాస్గో కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2026లో ఉండబోయే క్రీడలు
👉అథ్లెటిక్స్‌, పారా అథ్లెటిక్స్‌
👉స్విమ్మింగ్‌, పారా స్విమ్మింగ్‌
👉ఆర్టిస్టిక్‌ జిమ్నాస్టిక్స్‌
👉ట్రాక్‌ సైక్లింగ్‌, పారా ట్రాక్‌ సైక్లింగ్‌
👉నెట్‌బాల్‌
👉వెయిట్‌లిఫ్టింగ్‌, పారా వెయిట్‌లిఫ్టింగ్‌
👉బాక్సింగ్‌
👉జూడో
👉బౌల్స్‌, పారా బౌల్స్‌
👉3*3 బాస్కెట్‌బాల్‌, 3*3 వీల్‌చైర్‌ బాస్కెట్‌బాల్‌.

చదవండి: Sarfaraz vs KL Rahul: గిల్‌ రాక.. ఎవరిపై వేటు? కోచ్‌ ఆన్సర్‌ ఇదే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement