ENG VS IND 4th Test: పంత్‌ బ్యాటింగ్‌ చేస్తాడు.. బీసీసీఐ కీలక ప్రకటన | ENG VS IND 4th Test: BCCI Confirms Pant Will Be Available To Bat As Per Team Requirements | Sakshi
Sakshi News home page

ENG VS IND 4th Test: పంత్‌ బ్యాటింగ్‌ చేస్తాడు.. బీసీసీఐ కీలక ప్రకటన

Jul 24 2025 4:40 PM | Updated on Jul 24 2025 5:37 PM

ENG VS IND 4th Test: BCCI Confirms Pant Will Be Available To Bat As Per Team Requirements

ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్‌ తొలి రోజు ఆటలో గాయపడి రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగిన రిషబ్‌ పంత్‌కు సంబంధించి బీసీసీఐ కీలక అప్‌డేట్‌ ఇచ్చింది. పంత్‌ ఈ మ్యాచ్‌లో వికెట్‌కీపింగ్‌కు దూరంగా ఉన్నా, బ్యాటింగ్‌ చేస్తాడని కన్ఫర్మ్‌ చేసింది. పంత్‌ స్థానంలో ధృవ్‌ జురెల్‌ వికెట్‌ కీపింగ్‌ చేస్తాడని స్పష్టం చేసింది. 

గాయం తీవ్రత అధికంగా ఉన్నా ఆట రెండో రోజు పంత్‌ జట్టుతో చేరాడని, జట్టు అవసరాల దృష్ట్యా అతను బ్యాటింగ్‌ చేస్తాడని బీసీసీఐ తమ అధికారిక ట్విటర్‌ ఖాతా ద్వారా ప్రకటన చేసింది.

కాగా, ఈ మ్యాచ్‌ తొలి రొజు ఆట‌లో పంత్‌ క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో రివ‌ర్స్ స్వీప్ ఆడే ప్రయత్నం​ చేసి తీవ్రంగా గాయపడ్డాడు. బంతి బ్యాట్‌ ఎడ్జ్‌కు తగిలి పంత్ కుడి కాలు పాదానికి బలంగా తాకింది. దీంతో పంత్‌ తీవ్ర‌మైన నొప్పితో విలవిలలాడాడు. 

వెంట‌నే ఫిజియో వచ్చి చికిత్స అందించిన‌ప్ప‌టికి ఫ‌లితం లేక‌పోవడంతో పంత్‌ రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు. నడవలేని స్థితిలో ఉన్న పంత్‌ను వాహనంలో తీసుకెళ్లారు. పంత్‌ రిటైర్డ్  అయ్యే స‌మ‌యానికి 37 ప‌రుగులు చేశాడు.

ఇదిలా ఉంటే, ఓవర్‌నైట్‌ స్కోర్‌ 264/4 వద్ద రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓవర్‌నైట్‌ బ్యాటర్‌ రవీంద్ర జడేజా తన స్కోర్‌కు మరో పరుగు మాత్రమే జోడించి జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో హ్యారీ బ్రూక్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.

జడేజా ఆదిలోనే ఔటైనప్పటికీ శార్దూల్‌ ఠాకూర్‌ (39) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నాడు. వాషింగ్టన్‌ సుందర్‌ (13) శార్దూల్‌కు సహకరిస్తున్నాడు. కడపటి వార్తలు అందేసరికి భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. 

ఈ మ్యాచ్‌లో భారత్‌ టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన విషయం తెలిసిందే. భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్‌ 58, కేఎల్‌ రాహుల్‌ 46, సాయి సుదర్శన్‌ 61, శుభ్‌మన్‌ గిల్‌ 12, రిషబ్‌ పంత్‌ 37 (రిటైర్డ్‌ హర్ట్‌), రవీంద్ర జడేజా 20 పరుగులు చేశారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో స్టోక్స్‌ 2, వోక్స్‌, ఆర్చర్‌, డాసన్‌ తలో వికెట్‌ తీశారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ప్రస్తుతం ఇంగ్లండ్‌ 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement