CWC 2023: మా ఆయన దేవుడి బిడ్డ.. కోహ్లి సతీమణి భావోద్వేగం | CWC 2023: Anushka Sharma Calls Virat Kohli As God's Son After He Scored 50th ODI Hundred | Sakshi
Sakshi News home page

CWC 2023: మా ఆయన దేవుడి బిడ్డ.. కోహ్లి సతీమణి భావోద్వేగం

Nov 17 2023 8:47 AM | Updated on Nov 17 2023 9:28 AM

CWC 2023: Anushka Sharma Calls Virat Kohli As God's Son After He Scored 50th ODI Hundred - Sakshi

వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి సెమీఫైనల్లో టీమిండియా ఆటగాడు విరాట్‌ కోహ్లి 50 వన్డే సెంచరీలు పూర్తి చేసి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. విరాట్‌ ఈ ఘనత సాధించిన అనంతరం అతని భార్య, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ తీవ్ర భావోద్వేగానికి లోనైంది. అనుష్క శర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఇలా రాసుకొచ్చింది. 

‘దేవుడు ఉత్తమ స్క్రిప్ట్‌ రైటర్‌ కోహ్లి! నీ తలరాతను గొప్పగా రాశాడు. నీ ప్రేమను దక్కించుకున్న నేను దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నిన్ను చూస్తుంటే, నీ ప్రదర్శనను గమనిస్తుంటే నాకనిపిస్తుంది. ఆడేకొద్దీ, పెరిగే కొద్దీ నీ సత్తా సామర్థ్యం పెరుగుతోంది. ఆటకోసం నిరంతరం నిజాయితీగా శ్రమించే నీవు నిజంగా దేవుడి బిడ్డవే’ అంటూ భావోధ్వేగ సందేశాన్ని పోస్ట్‌ చేసింది. ఈ పోస్ట్‌ ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది.

ఇదిలా ఉంటే, న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో భారత్‌ 70 పరుగుల తేడాతో గెలుపొంది, నాలుగో సారి వరల్డ్‌కప్‌ ఫైనల్స్‌కు చేరిన విషయం తెలిసిందే. అనంతరం నిన్న జరిగిన రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా.. సౌతాఫ్రికాను 3 వికెట్ల తేడాతో ఓడించి ఎనిమిదో సారి ఫైనల్స్‌కు అర్హత సాధించింది. అహ్మదాబాద్‌ వేదికగా భారత్‌-ఆసీస్‌ల మధ్య నవంబర్‌ 19న తుది సమరం జరుగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement