Photo Courtesy: IPL 2026
టీమిండియా టీ20 ప్రపంచకప్ గెలవడంలో ఓపెనర్ సంజూ శాంసన్‌ది కీలకపాత్ర అని చెప్పొచ్చు. సూపర్-8లో వెస్టిండీస్‌తో మ్యాచ్ ద్వారా ఫామ్‌లోకి వచ్చిన సంజూ ఆ తర్వాత సెమీస్, ఫైనల్స్‌లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. అదే సూపర్‌ఫామ్‌ను ఐపీఎల్ 19వ సీజన్‌లోనూ కొనసాగిస్తాడని అంతా భావించిన వేళ సీన్ మొత్తం రివర్స్ అయింది.
రాజస్తాన్ రాయల్స్ నుంచి ఏ ముహూర్తంలో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ట్రేడ్ అయ్యాడో కానీ దారుణంగా విఫలమవుతూ వస్తున్నాడు. తొలి మూడు మ్యాచ్‌ల్లో సీఎస్‌కే ఓటమి చవిచూస్తే.. శాంసన్ ఆడకపోవడం కూడా జట్టును బాగా దెబ్బతీస్తోంది. శాంసన్ ఈ సీజన్‌లో సీఎస్‌కేకు బలమవుతాడనుకుంటే దారుణ ఆటతీరుతో బలహీనంగా మారిపోయాడు.
శాంసన్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ 6,7 9 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో సీఎస్‌కే అభిమానులు సంజూ శాంసన్ ఆటతీరుపై గుస్సా అవుతున్నారు. టీ20 ప్రపంచకప్‌లో హీరోగా నిలిచిన శాంసన్ ఐపీఎల్‌లో జీరో అయిపోయాడంటూ ట్రోల్స్‌కు గురి చేస్తున్నారు. రాజస్తాన్ కెప్టెన్‌గా అదరగొట్టిన శాంసన్ సీఎస్‌కేకు వచ్చేసరికి మాత్రం పూర్తిగా విఫలమవుతున్నాడు.
ముఖ్యంగా ఆడాలనే పట్టుదల శాంసన్‌లో ఏమాత్రం కనిపించడం లేదని సీఎస్‌కే అభిమానులు పేర్కొంటున్నారు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అవసరమైన పరుగులు చేయాల్సిన చోట విఫలమవుతుండడం చూసి ఆసక్తి లేకపోతే జట్టు నుంచి తప్పుకుంటే బాగుంటుందేమోనని సోషల్ మీడియా వేదికగా శాంసన్‌కు సలహాలు ఇస్తున్నారు.
మానసికంగా సిద్ధంగా లేకపోతే మాత్రం కొన్ని మ్యాచ్‌లకు జట్టు నుంచి తప్పుకోవడమే మేలని పేర్కొన్నారు. కెమెరాలన్నీ శాంసన్‌వైపు తిరిగిన ప్రతీసారి ఏదో కోల్పోయినట్లుగా శాంసన్ ఫీలవుతున్నాడని, సీఎస్‌కేలోకి వచ్చాకా ఇప్పటివరకు అతడు నవ్వడం తాము చూడలేదని అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు.
టీ20 ప్రపంచకప్‌లో కనిపించిన శాంసన్ మాకు కావాలని, ఆ కసి ఎక్కడా కనిపించడం లేదని, ఇప్పటినుంచైనా కాస్త శ్రద్ద పెడితే బాగుంటుందని వాపోయారు. ఐదుసార్లు ఐపీఎల్‌లో చాంపియన్‌గా నిలిచిన సీఎస్‌కే ఈ సీజన్‌లో హ్యాట్రిక్ ఓటములు నమోదు చేసి విజయం కోసం చకోర పక్షిలా ఎదురుచూడాల్సి వస్తోంది.
మ్యాచ్ విషయానికొస్తే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 43 పరుగుల తేడాతో చెన్నై సూపర్‌కింగ్స్‌పై విజయం సాధించింది. రజత్ పటిదార్, టిమ్ డేవిడ్, పడిక్కల్‌లు రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 3 వికెట్లష్టానికి 250 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన సీఎస్‌కే 19.4 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది.
Dear @IamSanjuSamson,
If you’re not mentally in it, then step aside for a few games. This isn’t just about runs anymore. Your body language is screaming disinterest. Every time the camera’s on you, you look frustrated and disconnected. Honestly, I’ve never seen you smiling even… pic.twitter.com/L7bFl0uJbf— Madras Man (@newbatsman) April 5, 2026
చదవండి: ఇరగదీస్తున్న ఇద్దరు మొనగాళ్లు.. రీఎంట్రీ ఇవ్వాల్సిందే!


