రొనాల్డో చర్య.. కోకా కోలాకు భారీ డ్యామేజ్‌.. మరి ఆ యాడ్‌!

Cristiano Ronaldo Water Bottle Endorsement Coca Cola Lose 4 Billion Dollars - Sakshi

మంచి నీళ్లే తాగాలని.. కార్బొనేటెడ్‌ సాఫ్ట్‌ డ్రింక్స్‌ వద్దంటూ ఫేమస్‌ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ క్రిస్టియానో రోనాల్డో చేసిన కామెంట్‌ కీలక పరిణామానికి దారితీసింది. రోనాల్డో వీడియో తర్వాత కోకా కోలా కంపెనీకి ఊహించని రీతిలో డ్యామేజ్‌ జరిగింది. 

యూరో ఛాంపియన్‌షిప్‌ ప్రెస్‌ మీట్‌ సందర్భంగా పోర్చుగల్‌ స్టార్‌ ప్లేయర్‌ రొనాల్డో.. తనకు ఎదురుగా ఉన్న కోక్‌ బాటిళ్లను చిరాకుగా పక్కనపెట్టి, మంచి నీళ్లకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించాడు. వాటర్‌ బాటిల్‌ పైకెత్తి ‘అగ్వా’(పోర్చుగ్రీసు భాషలో మంచినీళ్లు అని అర్థం) అని కామెంట్‌ చేశాడు. తర్వాత ఈ వీడియో వైరల్‌ అయ్యింది. అయితే 36 ఏళ్ల రొనాల్డో కామెంట్‌ ఎఫెక్ట్‌ మార్కెట్‌పై దారుణంగా చూపెట్టింది. ​కోకా కోలా స్టాక్‌ ధరలు 1.6 శాతానికి పడిపోయి.. 238 బిలియన్ల అమెరికన్‌ డాలర్లకు చేరింది. అంతకు ముందు కోకా కోలా విలువ 248 బిలియన్ల డాలర్లు ఉండింది. దీంతో 4 బిలియన్ల డాలర్లు(మన కరెన్సీలో 29 వేల కోట్ల దాకా) నష్టం వాటిల్లినట్లయ్యింది. 

కోకాకోలా రియాక్షన్‌
ఇక క్రిస్టియానో రొనాల్డో వ్యవహరించిన తీరుపై యూరో ఛాంపియన్‌షిప్‌ స్పానర్‌షిప్‌గా వ్యవహరిస్తున్న కోకాకోలా స్పందించింది. ‘ఎవరికి నచ్చిన డ్రింక్‌లు వాళ్లు తాగుతారు’ అని బదులిచ్చింది. ఎవరి టేస్ట్‌లు వాళ్లకు ఉంటాయి. అవసరాలను బట్టి ఎవరికి నచ్చిన డ్రింక్‌లు వాళ్లు తాగుతారు. అందులో తప్పేముంది. ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో నీళ్లతో పాటు కోకా కోలా డ్రింక్‌లు కూడా సర్వ్‌ చేస్తున్నాం. అతని కంటే ముందు ఎంతో మంది ప్లేయర్లు కోక్‌ తాగం చూసే ఉంటారు అని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు.

 

రొనాల్డో.. యాడ్‌ గుర్తుందా?
ఇక ఇప్పుడు ఏ డ్రింక్‌ల పట్ల అయితే క్రిస్టియానో రొనాల్డో అయిష్టత, అసహ్యం కనబరిచాడో.. కొన్నేళ్ల క్రితం అదే కార్బొనేట్‌ సాఫ్ట్‌ డ్రింక్‌ కంపెనీకి ఒక యాడ్‌ చేశాడు. 2006లో 22 ఏళ్ల రొనాల్డో కోకా కోలా బ్రాండ్‌కు యాడ్‌ చేశాడు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆ యాడ్‌ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది. కొందరు రొనాల్డ్‌ తీరును తప్పుబడుతుండగా.. అభిమానులు మాత్రం ఆ వయసుకి రొనాల్డోకి అంత పరిణితి లేదని, అతని డైట్‌లో చాలా ఏళ్లుగా మార్పు వచ్చిందని గుర్తుచేస్తున్నారు.

చదవండి: రొనాల్డో-మెస్సీ.. మధ్యలో మనోడు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top