సినీ నటితో వివాదంలో శ్రీలంక విధ్వంసకర బ్యాటర్‌ | Bhanuka Rajapaksa In Illegal Scandal With An Actress | Sakshi
Sakshi News home page

సినీ నటితో వివాదంలో శ్రీలంక విధ్వంసకర బ్యాటర్‌

Apr 1 2026 5:23 PM | Updated on Apr 1 2026 6:19 PM

Bhanuka Rajapaksa In Illegal Scandal With An Actress

శ్రీలంక విధ్వంసకర బ్యాటర్‌ భానుక రాజపక్స ఓ సినీ నటితో న్యాయపరమైన వివాదంలో చిక్కుకున్నాడు. ఈ కేసు ఓ బంగారు గొలుసు చుట్టూ తిరుగుతోంది. హర్షి రసంగా అనే స్థానిక యువ నటికి రాజపక్స ఓ బంగారు గొలుసు (రూ. 9 లక్షలు) ఇచ్చాడు. దీన్ని బహుమతిగా భావించిన ఆమె.. అవసరాల రిత్యా తాకట్టు పెట్టి డబ్బు చేసుకుంది. 

అయితే గొలుసును హర్షి తన వద్ద అరువు తీసుకొని, అనుమతి లేకుండా తాకట్టు పెట్టుకుందని రాజపక్స పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసుల విచారణ జరిపి హర్షిని అరెస్ట్‌ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆమెకు రూ. 5 లక్షల చొప్పున రెండు ష్యూరిటీలు పెట్టి బెయిల్‌ మంజూరు చేసింది. విచారణలో హర్షి న్యాయవాదులు గొలుసును తాకట్టు పెట్టిన విషయాన్ని అంగీకరించి, తిరిగి విడిపిస్తామని హామీ ఇచ్చారు.  

మాట మార్చిన హర్షి
బెయిల్‌ లభించిన తర్వాత హర్షి మాట మార్చింది. మీడియా ముందుకు వచ్చి షాకింగ్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. గొలుసు తనకు రాజపక్స వ్యక్తిగత సంబంధంలో గిఫ్ట్‌గా ఇచ్చాడని తెలిపింది. దీంతో ఈ వివాదం కొత్త మలుపు తిరిగింది. రాజపక్స వైఖరిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రాజపక్స ఇటీవల టీమిండియాపై నిరాధరమైన ఆరోపణలు చేసి వార్తల్లోకెక్కాడు. తాజాగా ముగిసిన టీ20 వరల్డ్‌ కప్‌లో భారత ఆటగాళ్లు ఉపయోగించే బ్యాట్లు అసాధారణంగా ఉన్నాయని అనుమానాలు వ్యక్తం చేశాడు. ఈ వ్యాఖ్యల తర్వాత అతను టీమిండియా అభిమానుల నుంచి చీవాట్లు తిన్నాడు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement