BGT 2023: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ.. రికార్డులు ఎవరివి..?

27 ఏళ్ల చరిత్ర కలిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత-ఆస్ట్రేలియా జట్లు కొదమ సింహాల్లా పోరాడి, ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌కు ఏమాత్రం తీసిపోదని విధంగా ఈ సిరీస్‌ను రక్తి కట్టించాయి. ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభంకానున్న BGT 2023 నేపథ్యంలో ఈ సిరీస్‌పై చర్చ మరోసారి మొదలైంది. క్రికెట్ సర్కిల్స్‌లో ఎక్కడ చూసినా ఈ సిరీస్‌పైనే డిస్కషన్ నడుస్తుంది. భారత్ వేదికగా జరుగనున్న ఈ సిరీస్‌లో అత్యధిక పరుగులు ఎవరు సాధిస్తారు, అత్యధిక వికెట్లు ఎవరు తీస్తారు, అత్యుత్తమ వ్యక్తిగత స్కోర్ ఎవరిది.. అత్యుత్తమ వ్యక్తిగత గణాంకాలు ఎవరు నమోదు చేశారు..? ఇలా ఎవరికి తోచిన విధంగా వారు ప్రశ్నలు, విశ్లేషణలు, ఎక్స్‌పెక్టేషన్స్‌తో సోషల్‌మీడియాను హోరెత్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో BGT చరిత్రపై ఓ లుక్కేద్దాం.
1996లో మొదలైన ఈ ట్రోఫీలో ఇప్పటివరకు మొత్తం 15 సిరీస్‌లు జరగ్గా భారత్ 9, ఆసీస్ 5 సిరీస్‌ల్లో గెలుపొందాయి. ఓ సిరీస్ డ్రాగా ముగిసింది. వ్యక్తిగత గణాంకాల విషయానికొస్తే.. ఈ సిరీస్‌లో అత్యధిక పరుగుల రికార్డు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. ఈ ట్రోఫీలో సచిన్ 34 టెస్ట్‌ల్లో 56.24 సగటున 3262 పరుగులు చేశాడు. ఈ జాబితాలో సచిన్ తర్వాతి స్థానాల్లో రికీ పాంటింగ్ (29 టెస్ట్‌ల్లో 2555), వీవీఎస్ లక్ష్మణ్ (29 టెస్ట్‌ల్లో 2434), రాహుల్ ద్రవిడ్ (32 టెస్ట్‌ల్లో 2143), మైఖేల్ క్లార్క్ (22 టెస్ట్‌ల్లో 2049) టాప్-5లో ఉన్నారు. ఈ ట్రోఫీలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ విషయానికొస్తే.. ఈ రికార్డు మైఖేల్ క్లార్క్ (329) పేరిట ఉంది. అత్యధిక టెస్ట్‌లు (34), అత్యధిక సెంచరీలు (9), అత్యధిక హాఫ్ సెంచరీల (16) రికార్డులు సచిన్ పేరిట ఉన్నాయి.
బౌలింగ్ విషయానికొస్తే.. ఈ విభాగంలో టీమిండియా మాజీ స్పిన్నర్లు అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్‌ల డామినేషన్ నడిచింది. ఈ ట్రోఫీలో కుంబ్లే 20 మ్యాచ్‌ల్లో 111 వికెట్లు పడగొట్టి లీడింగ్ వికెట్ టేకర్‌గా ఉండగా.. భజ్జీ 18 టెస్ట్‌ల్లో 95 వికెట్లు పడగొట్టి రెండో స్థానంలో ఉన్నాడు. ఓ మ్యాచ్‌లో అత్యుత్తమ గణాంకాల విషయానికొస్తే.. భజ్జీ టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. భజ్జీ ఓ మ్యాచ్‌లో అత్యధికంగా 15 వికెట్లు పడగొట్టాడు. భజ్జీ తర్వాతి స్థానంలో కుంబ్లే (13) ఉన్నాడు. ఓ ఇన్నింగ్స్‌లో అత్యుత్తమ గణాంకాలను పరిశీలిస్తే.. ఈ విభాగంలో ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయోన్ టాప్‌లో ఉన్నాడు. లయోన్ ఓ ఇన్నింగ్స్‌లో 50 పరుగులిచ్చి 8 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్, బౌలింగ్‌కు సంబంధించి BGTలో ఇవే అత్యుత్తమ గణాంకాలు.
మరిన్ని వార్తలు :
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు