వైభ‌వ్‌ను సూర్యవంశీని వెతికి తీసుకొచ్చింది ఇత‌డే | Meet The Man Who Discovered Vaibhav Suryavanshi, The Untold Story Behind Rajasthan Royals Wonder Kid, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

IPL 2026: వైభ‌వ్‌ను సూర్యవంశీని వెతికి తీసుకొచ్చింది ఇత‌డే

May 28 2026 10:43 AM | Updated on May 28 2026 11:21 AM

Behind the rise of Vaibhav Sooryavanshi

వైభ‌వ్ సూర్య‌వంశీ.. క్రికెట్ ప్ర‌పంచంలో ఈ పేరు మారుమ్రోగిపోతుంది. ఐపీఎల్‌-2026లో ముల్లాన్‌పూర్ వేదిక‌గా సన్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రిగిన ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లో వైభ‌వ్ సూర్య‌వంశీ ఆకాశ‌మే హ‌ద్దుగా చెలరేగిపోయాడు. ఐపీఎల్ చ‌రిత్ర‌లో చిర‌స్మ‌ర‌ణీయంగా నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడాడు వైభ‌వ్‌.

ఐపీఎల్ మొద‌లై 19 సీజ‌న్లు అవుతున్న‌ప్ప‌టికి ప్లే ఆఫ్స్‌లో ఇలాంటి ఇన్నింగ్స్‌ను ఇప్ప‌టివ‌ర‌కు చూడ‌లేదు. ఈ నాకౌట్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బౌలర్లుకు సూర్యవంశీ చుక్కలు చూపించాడు. ఆఖరికి ప్లాన్‌-బి, ప్లాన్‌-సి అని చెప్పిన సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్‌ను సైతం ఈ వండ‌ర్ కిడ్ వదల్లేదు. 

15 ఏళ్ల వైభవ్ కేవ‌లం  29 బంతుల్లోనే 5 ఫోర్లు, 12 సిక్స్‌ల‌తో 97 ప‌రుగులు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. ఒక ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్ల బాదిన ప్లేయర్‌గా క్రిస్ గేల్ ఆల్‌టైమ్ రికార్డును సూర్యవంశీ(62) బ్రేక్ చేశాడు. అతడి అద్భుత ఇన్నింగ్స్‌కు సచిన్ టెండూల్కర్‌, యువరాజ్ సింగ్‌, క్రిస్ గేల్ వంటి దిగ్గజాలు సైతం ఫిదా అయిపోయారు. అయితే వైభవ్ సూర్యవంశీ వంటి చిచ్చ‌ర పిడుగును ఐపీఎల్‌కు పరిచయం చేసింది ఎవరో తెలుసా? అతడి ఐపీఎల్‌ ఎంట్రీ వెనక చాలా కథ దాగి ఉంది.

థాంక్యూ సమర్‌..
వైభ‌వ్  సూర్య‌వంశీలోని టాలెంట్‌ను తొలుత గుర్తించింది బిహార్ మాజీ స్పిన్న‌ర్‌, రాజ‌స్తాన్ రాయ‌ల్స్ టాలెంట్ స్కౌటింగ్ టీమ్‌లో సభ్యుడైన సమర్ ఖాద్రీ. సమర్ ఖాద్రీ దేశవాళీ మ్యాచ్‌లలో వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్‌ను మొదటిసారి చూశాడు. కేవ‌లం 14 ఏళ్ల వ‌య‌సులోనే వైభ‌వ్ ఆడుతున్న అద్భుత‌మైన షాట్లు, అత‌డిలోని టాలెంట్ చూసి ఖాద్రీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు.

వెంట‌నే వైభ‌వ్ గురుంచి రాజ‌స్తాన్ హై పర్ఫార్మెన్స్ అండ్ స్కౌటింగ్ హెడ్ జుబిన్ భరుచాకు సమాచారం అందించాడు. దీంతో జూబిన్.. వైభ‌వ్ కోసం ప్రత్యేకంగా ట్రయల్స్ ఏర్పాటు చేశారు. అయితే ట్ర‌య‌ల్స్‌లో వైభ‌వ్ త‌ను ఎదుర్కొన్న మొద‌టి బంతిని సిక్స‌ర్‌గా మ‌లిచాడు. ఇది చూసిన జుబిన్ సైతం బిత్త‌ర‌పోయాడు. 

ఎందుకంటే రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ట్ర‌య‌ల్స్‌లో అప్ప‌టివ‌ర‌కు సంజూ శాంస‌న్‌, జైశ్వాల్ మాత్ర‌మే తాము ఎదుర్కొన్న మొద‌టి బంతిని సిక్స‌ర్ బాదాడు. ఆ జాబితాలో వైభ‌వ్ కూడా చేరాడు. ట్రయల్స్ ముగిసిన వెంటనే ఆర్‌ఆర్ మేనేజ్‌మెంట్‌కు జుబిన్ ఒక సందేశం పంపాడు. రాబోయే ఐపీఎల్ వేలంలో ఈ అబ్బాయి కోసం రూ.10 కోట్లు సిద్ధంగా ఉంచుకోండి.

ఎందుకంటే మనం ఒక అరుదైన, అసాధారణమైన టాలెంట్‌ను చూశాను అంటూ రాజ‌స్తాన్ యాజ‌మాన్యానికి తెలియ‌జేశాడు. దీంతో ఐపీఎల్‌-2025 మెగా వేలంలో రూ.1.10 కోట్లతో వైభ‌వ్‌ను ప‌ట్టుబ‌ట్టి మ‌రి రాజ‌స్తాన్ రాయ‌ల్స్ సొంతం చేసుకుంది. అప్ప‌టిలో ఒక యువ ఆట‌గాడిపై అంత మొత్తాన్ని వెచ్చించ‌డాన్ని చాలా మంది త‌ప్పుప‌ట్టారు. కానీ ఇప్పుడు అత‌డి విలువ వందల కోట్లతో సమానం.
చదవండి: ఆ ఇన్నింగ్స్ అద్భుతం.. వైభవ్‌ బ్యాటింగ్‌కు సచిన్ ఫిదా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement