ఆ ఇన్నింగ్స్ అద్భుతం.. వైభవ్‌ బ్యాటింగ్‌కు సచిన్ ఫిదా | Sachin Tendulkar Reacts To Vaibhav Sooryavanshis Record-Smashing Knock Against SRH In IPL 2026 Eliminator, Check Details Inside | Sakshi
Sakshi News home page

ఆ ఇన్నింగ్స్ అద్భుతం.. వైభవ్‌ బ్యాటింగ్‌కు సచిన్ ఫిదా

May 28 2026 9:25 AM | Updated on May 28 2026 1:36 PM

Sachin Tendulkar Reacts To Vaibhav Sooryavanshis Record-Smashing IPL Knock

ఐపీఎల్‌-2026లో భాగంగా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రిగిన ఎలిమినేట‌ర్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ యంగ్ కిడ్ వైభ‌వ్ సూర్య‌వంశీ విధ్వంసం సృష్టించాడు. వరుసగా ఎనిమిది ఓవర్ల పాటు తన మెరుపు బ్యాటింగ్‌తో కోట్లాది మంది అభిమానులను టీవీలకు అతుక్కుపోయేలా చేశాడు.

15 ఏళ్ల వైభవ్.. పాట్ కమ్మిన్స్ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను సైతం వదల్లేదు. తొలి ఓవర్ నుంచే సన్‌రైజర్స్ బౌలర్లను ఉతికారేశాడు. కేవలం 29 బంతుల్లోనే ఐదు ఫోర్లు, 12 సిక్స్‌లతో 97 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని ఈ చిచ్చరపిడుగు కోల్పోయాడు. ఇక వైభవ్ సంచ‌ల‌న‌ ఇన్నింగ్స్‌కు భార‌త క్రికెట్ దిగ్గ‌జం సచిన్ టెండూల్కర్ సైతం ఫిదా అయిపోయాడు. వైభ‌వ్‌పై మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు.

"వైభవ్ సూర్యవంశీ బ్యాట్ స్వింగ్ అద్భుతంగా ఉంది. అతడి కాళ్ల వైపు వచ్చే బంతులను ఫ్రంట్‌ఫుట్ క్లియర్ చేసి పక్కకు జరుగుతూ ఆడే విధానం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ స్వేచ్ఛే అతన్ని తనదైన శైలిలో ఆడేలా చేస్తోంది. అతడు ఆడిన ఆ ఇన్నింగ్స్ నిజంగా అత్యుద్భుతం" అని సచిన్ ఎక్స్‌లో రాసుకొచ్చాడు.

కాగా ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై 47 పరుగుల తేడాతో రాజస్తాన్ విజయం సాధించింది. దీంతో ఎస్‌ఆర్‌హెచ్ టోర్నీ నుంచి నిష్క్రమించగా.. రాయల్స్ క్వాలిఫయర్‌-2కు అర్హత సాధించింది.
చదవండి: అతడి బ్యాటింగ్ చూసి భయపడ్డాం.. మా ఓటమికి కారణమిదే: కమిన్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement