
ఆసియాకప్-2025లో ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో టీమిండియా విజయభేరి మ్రోగించింది. అయితే ఈ మ్యాచ్ టాస్ సందర్భంగా గానీ, ఆట ముగిశాక కానీ భారత జట్టు ఆటగాళ్లు పాకిస్తాన్ ప్లేయర్లతో కరచాలనం చేసేందుకు ఇష్టపడలేదు.
ఎటువంటి కరచాలనాలు, పలకరింపులు లేకుండా తమ పని తాము చేసుకుని మైదానం వీడారు.పెహల్గమ్ ఉగ్రదాడికి నిరసనగా ఇండియన్ టీమ్ మెనెజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఒకవేళ సూపర్-4లో మరోసారి పాక్‌తో తలపడితే సూర్య అండ్ కో ఇదే పద్దతిని కొనసాగించనున్నట్లు తెలుస్తోంది.
ది ఎకనామిక్ టైమ్స్ ప్రకారం.. బీసీసీఐ నుంచి అనుమతి లభించిన తర్వాతే పాక్ ఆటగాళ్లతో హ్యాండ్ షేక్‌చేయకూడదనే నిర్ణయాన్ని టీమిండియా తీసుకుందంట. అయితే భారత ఆటగాళ్లు తమతో కరచాలనం చేయకపోవడంపై పాకిస్తాన్ టీమ్ అసహనం వ్యక్తం చేసింది.
ఇది క్రీడా స్పూర్తికి విరుద్దమని, భారత జట్టు తీరుపై ఆసియా క్రికెట్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేసేందుకు పాకిస్తాన్ సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పాకిస్తాన్‌కు బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు గట్టి కౌంటరిచ్చారు. పాక్ ఫిర్యాదు చేసిన అది చెల్లదు అని ఆయన తెలిపారు.
"మీకు ఏదైనా సందేహం ఉంటే ఒక్కసారి రూల్ బుక్‌ను చదవండి. అందులో ఎక్కడ కూడా ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లకు కరచాలనం ఇవ్వాలని ప్రత్యేకంగా ఏమీలేదు. అది కేవలం మర్యాదపూర్వకమైన సంజ్ఞ మాత్రమే. షేక్ హ్యాండ్స్ ఇవ్వాలా లేదా అన్నది వారి సొంత నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది.
అంతే తప్ప ప్రత్యేకంగా చట్టం ఏమీ లేదు. కాబట్టి ఇండియన్ క్రికెట్ టీమ్ ప్రత్యర్థి జట్టుతో కరచాలనం చేయకపోయిన అదేమి పెద్ద నేరం కాదు" అని సదరు అధికారి పీటీఐతో పేర్కొన్నారు.
చదవండి: Asia Cup 2025: ఇది కదా సక్సెస్ అంటే.. గురువు రికార్డునే బద్దలు కొట్టిన అభిషేక్