కోహ్లి రికార్డు బద్దలు కొట్టిన పాక్‌ క్రికెటర్‌ | Babar Azam 12K Runs In T20 Format Breaks Kohli Record | Sakshi
Sakshi News home page

కోహ్లి రికార్డు బద్దలు కొట్టిన పాక్‌ క్రికెటర్‌

Apr 10 2026 10:39 AM | Updated on Apr 10 2026 11:56 AM

Babar Azam 12K Runs In T20 Format Breaks Kohli Record

పాకిస్తాన్‌ బ్యాటర్‌ బాబర్ ఆజం విరాట్‌ కోహ్లి రికార్డును అధిగమించాడు. పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌)లో బాబర్‌ ఆజం పెషావర్‌ జాల్మీ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. దీనిలో భాగంగా కరాచీ కింగ్స్ జరిగిన మ్యాచ్ లో బాబర్ ఆజం టీ20 క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. 

టీ20 క్రికెట్‌లో బాబర్‌ ఆజం 12 వేల పరుగుల మైలురాయిని చేరుకుని ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. తన కెరీర్‌లో 351వ  టీ20 మ్యాచ్ ఆడుతున్న బాబర్ 338 ఇన్నింగ్స్ ల్లో ఈ రికార్డును చేరుకోవడం విశేషం. గతంలో ఈ రికార్డు వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ (343 ఇన్నింగ్స్‌లు) పేరిట ఉంది.

టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి (360 ఇన్నింగ్స్‌) మూడో స్థానంలో ఉన్నాడు. బాబర్ ఈ ఘనత సాధించిన రెండో పాకిస్థానీ బ్యాటర్ కాగా, ఇప్పటికీ పాక్ తరపున అత్యధిక టీ20 పరుగుల రికార్డు షోయబ్ మాలిక్ పేరిట ఉంది. ఈ మ్యాచ్ లో ఓపెనర్ బరిలోకి దిగిన బాబర్ 51 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 87 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 

కుశాల్ మెండిస్‌తో కలిసి రెండో వికెట్‌కు ఏకంగా 191 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో పెషావర్ జల్మీ 20 ఓవర్లలో 246/3 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 247 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కరాచీ కింగ్స్.. పెషావర్ బౌలర్ల ధాటికి పేకమేడలా కూలిపోయింది. ఇఫ్రికార్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, సుఫియాన్ ముఖీమ్ చెరో మూడు వికెట్లతో చెలరేగడంతో కరాచీ కేవలం 87 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా బాబర్ సేన ఘన విజయాన్ని అందుకుంది.

చదవండి: ‘సరదాగా అన్న మాట ఇవాళ నిజమైంది’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement