Photo Courtesy: IPL 2026
ఐపీఎల్ 19వ సీజన్‌లో భాగంగా శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ ఆటగాడు ఆయుశ్ మాత్రే రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆయుశ్ రిటైర్డ్ ఔట్ వెనుక సీఎస్‌కే మేనేజ్‌మెంట్ హస్తం ఉంది. మంచి ఈజ్‌తో బ్యాటింగ్ చేస్తున్న ఆయుశ్ మాత్రేను అర్థంతరంగా రిటైర్డ్ ఔట్‌గా వెళ్లిపోవడం వెనుక విమర్శలు వచ్చాయి.
కానీ సీఎస్‌కే నిర్ణయం సరైనదే అని కాసేపటికే తెలిసొచ్చింది. ఆయుశ్ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన హార్డ్ హిట్టర్ శివమ్ దూబే తన పాత్రకు న్యాయం చేస్తూ వేగంగా పరుగులు రాబట్టాడు. ఫలితంగా సీఎస్‌కే భారీ స్కోరు సాధించింది. ఆయుశ్ మాత్రే రిటైర్డ్ ఔట్ వెనుక కోచ్ స్టీఫెన్ ప్లెమింగ్ పాత్ర కీలకం. అందుకే మాత్రే పెవిలియన్ చేరుకున్న సమయంలో అతడికి స్టాండింగ్ ఒవేషన్ లభించింది.
ఈ నేపథ్యంలో ఆయుశ్ మాత్రే ఒక అరుదైన జాబితాలో చేరిపోయాడు. ఐపీఎల్‌లో రిటైర్డ్ ఔట్‌లు చాలా తక్కువగా జరుగుతుంటాయి. గతంలో రవిచంద్రన్ అశ్విన్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, డెవాన్ కాన్వే వంటి క్రికెటర్లు రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగారు. తాజాగా ఈ జాబితాలో ఆయుశ్ మాత్రే కూడా చేరిపోయాడు. కాగా ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆయుశ్ మాత్రేదే తొలి రిటైర్డ్ ఔట్.
సాధారణంగా క్రికెట్‌లో రిటైర్డ్ హర్ట్, రిటైర్డ్ ఔట్ వేర్వేరు. రిటైర్డ్ హర్ట్' అంటే గాయం కారణంగా ఆటగాడు మైదానం విడిచిపెట్టడం. అదే రిటైర్డ్ ఔట్ అనేది జట్టు ప్రయోజనాల కోసం స్వచ్చందంగా మైదానం విడిచిపెట్టడం. రిటైర్డ్ హర్ట్ అయితే సదరు మ్యాచ్‌లో మళ్లీ మైదానంలోకి వచ్చేందుకు అవకాశం ఉంటుంది.
రిటైర్డ్ ఔట్ అలా కాదు. ఒక్కసారి రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగితే మళ్లీ క్రీజులోకి వచ్చేందుకు అవకాశం ఉండదు. మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్‌కింగ్స్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. శాంసన్ సెంచరీ, శివమ్ దూబే అజేయ అర్థసెంచరీతో రాణించారు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది.


