చరిత్ర సృష్టించిన టీమిండియా.. క్రికెట్‌లో మొట్టమొదటి గోల్డ్‌ మెడల్‌ సొంతం | Sakshi
Sakshi News home page

Asian Games 2023: చరిత్ర సృష్టించిన టీమిండియా.. క్రికెట్‌లో మొట్టమొదటి గోల్డ్‌ మెడల్‌ సొంతం

Published Mon, Sep 25 2023 2:55 PM

Asian Games 2023 Womens Cricket: India Beat Sri Lanka To Clinch Gold Medal - Sakshi

ఏషియన్‌ గేమ్స్‌ మహిళల క్రికెట్‌ ఈవెంట్‌లో టీమిండియా మొట్టమొదటి గోల్డ్‌ మెడల్‌ను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది. శ్రీలంకతో ఇవాళ (సెప్టెంబర్‌ 25) జరిగిన ఫైనల్లో భారత్‌ 19 పరుగుల తేడాతో విజయం సాధించింది.  స్వర్ణం కోసం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన శ్రీలంక లక్ష్యానికి 20 పరుగుల దూరంలో నిలిచిపోయి రజతంతో సరిపెట్టుకుంది.

కాంస్య పతకం కోసం ఇవాళే జరిగిన మరో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ పాకిస్తాన్‌ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఆసియా క్రీడల్లో భారత్‌కు ఇవాళ ఇది రెండో స్వర్ణ పతకం కావడం విశేషం. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో భారత్  తొలి స్వర్ణం కైవసం చేసుకుంది. రుద్రాంక్ష్ బాలాసాహెబ్ పాటిల్, దివ్యాంశ్ సింగ్ పన్వార్ ,ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్‌లతో కూడిన జట్టు భారత్‌కు తొలి బంగారు పతకాన్ని అందించింది.

Advertisement
 
Advertisement
 
Advertisement