
ఆసియాకప్-2025లో ఉత్కంఠభరితమైన పోరుకు సమయం అసన్నమైంది. ఈ టోర్నీలో భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా భారత్-పాకిస్తాన్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులు ఈ మ్యాచ్ వీక్షించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
పెహల్గమ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ వంటి పరిణామాల తర్వాత దాయాదుల పోరు జరగనుండడంతో మరింత ఆసక్తి నెలకొంది. ఈ హైవోల్టేజ్ ఈ మ్యాచ్ కోసం తమ వ్యూహాలను ఇరు జట్లు సిద్దం చేసుకుంటున్నాయి. ఇరు జట్లు తమ తొలి మ్యాచ్‌లలో విజయం సాధించి మంచి ఊపు మీద ఉన్నాయి. యూఏఈతో ఆడిన తుది జట్టునే పాక్‌తో మ్యాచ్‌కు భారత్ కొనసాగించే అవకాశముంది.
అభిషేక్ 'ఫియర్'
అయితే భారత యువ సంచలనం అభిషేక్ శర్మను చూసి పాకిస్తాన్ భయపడుతందంట. అతడి కోసం పాక్ టీమ్ మెనెజ్‌మెంట్ ప్రత్యేక వ్యూహాలను రచిస్తున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. అభిషేక్‌ను ఎలాగైనా పవర్ ప్లే లోపు ఔట్ చేసేందుకు మెన్ ఇన్ గ్రీన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
అతడి బ్యాటింగ్‌కు సంబంధించిన పాత వీడియోలను పాక్ హెడ్ కోచ్ తమ బౌలర్లకు చూపించి ప్రాక్టీస్ చేయస్తున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. అభిషేక్‌కు అవుట్‌సైడ్ ఆఫ్‌స్టంప్ బంతుల వీక్‌నెస్ ఉంది. అతడి బలహీనతను క్యాష్ చేసుకోవాలని పాక్ భావిస్తోంది.
కానీ ఒక ఆరు ఓవర్ల పాటు అభిషేక్ క్రీజులో ఉంటే పాక్ బౌలర్లను షేక్ ఆడించేస్తాడు. యూఏఈతో జరిగిన తొలి మ్యాచ్‌లో కూడా ఈ పంజాబ్ బ్యాటర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 30 పరుగులు చేసి ఔటయ్యాడు.
అభిషేక్.. విధ్వంసకర బ్యాటింగ్‌కు పెట్టింది పేరు. అంతర్జాతీయ టీ20ల్లో అతడి స్ట్రైక్ రేటు 193.50గా ఉంది. అంతేకాకుండా ఐపీఎల్‌లో ఎస్ఆర్‌హెచ్ తరపున ఎన్నో తుపాన్ ఇన్సింగ్స్‌లు ఈ లెఫ్డ్ హ్యాండ్ బ్యాటర్ ఆడాడు.
చదవండి: టీమిండియాతో మ్యాచ్.. పాక్ జట్టులోకి డేంజరస్ బౌలర్?