
ఆసియాకప్-2025లో తమ తొలి మ్యాచ్‌లో ఒమన్‌ను చిత్తు చేసిన పాకిస్తాన్.. ఇప్పుడు అసలు సిసలైన పోరుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా పాక్ ఆదివారం తమ చిరకాల ప్రత్యర్ధి భారత్ తలపడనుంది. పాక్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉంది.
ఈ ఈవెంట్‌కు ముందు యూఏఈ వేదికగా జరిగిన ట్రైసిరీస్‌ను కూడా మెన్ ఇన్ బ్లూ సొంతం చేసుకుంది. ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ బ్యాటింగ్ పరంగా కాస్త నిరాశపరిచినప్పటికి బౌలింగ్‌లో మాత్రం అదరగొట్టింది. ముఖ్యంగా స్పిన్నర్లు సైమ్ అయూబ్, మహ్మద్ నవాజ్, సోఫియన్ ముఖియమ్, అబ్రార్ ఆహ్మద్ అద్బుతంగా రాణించారు. అయితే భారత్‌తో మ్యాచ్‌కు మాత్రం పాక్ తుది జట్టులో ఓ మార్పు చోటు చేసుకునే అవకాశముంది.
హ్యారిస్ రౌఫ్ ఇన్..?
తొలి మ్యాచ్‌కు బెంచ్‌కే పరిమితమైన స్పీడ్ స్టార్ హారిస్ రౌఫ్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకురావాలని పాక్ టీమ్ మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. యూఏఈతో మ్యాచ్‌లో ఫ్రంట్ లైన్ పేసర్‌గా షాహీన్ అఫ్రిది ఒక్కడే ఆడాడు. అతడితో ఆల్‌రౌండర్ ఫహీమ్ అష్రఫ్ బంతిని పంచుకున్నాడు.
కానీ టీమిండియా వంటి కఠిన ప్రత్యర్ధితో ఆడుతున్నప్పుడు కచ్చితంగా పాక్ వ్యూహాలు మారుతాయి. స్పిన్నర్ సోఫియన్ ముఖియమ్‌ను పక్కన పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అతడి స్ధానంలోనే రౌఫ్ ఎంట్రీ ఇవ్వనున్నాడంట. దుబాయ్ వికెట్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది.
అయితే భారత బ్యాటర్లు స్పిన్నర్లకు ఎలాగో మెరుగ్గానే ఆడుతారు. కాబట్టి అదనపు ఫాస్ట్ బౌలర్‌తో బరిలోకి దిగేందుకు పాక్ సిద్దమైందంట. ముఖియమ్‌ను పక్కన పెట్టిన అర్బర్ ఆహ్మద్, నవాజ్, అయూబ్ రూపంలో ముగ్గురు స్పిన్నర్లు ఉంటారు. ఒకవేళ నాలుగో స్పిన్నర్ అవసరమైతే కెప్టెన్ సల్మాన్ సైతం బంతిని గింగరాలు తిప్పగలడు. ఈ ఒక్క మార్పు మినహా ఒమన్‌తో ఆడిన జట్టునే పాక్ కొనసాగించే అవకాశముంది.
భారత్‌తో మ్యాచ్‌కు పాక్ జట్టు..
సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, ఫఖర్ జమాన్, సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), హసన్ నవాజ్, మహ్మద్ హారీస్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్, సుఫియాన్ ముఖీమ్