
ఆసియాకప్-2025లో భాగంగా అబుదాబి వేదికగా హాంకాంగ్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో హాంకాంగ్‌పై బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. హాంకాంగ్ విధించిన 144 పరుగుల లక్ష్యాన్ని 17.4 ఓవర్లలోనే బంగ్లాదేశ్ చేధించింది. బంగ్లాదేశ్ బ్యాటర్లలో లిట్టన్ దాస్ 59(39) పరుగులతో 142 పరుగుల వద్ద మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. తౌహిద్ హృదయ్ 34 (35) పరుగులు చేశారు. ఇక హాంకాంగ్ బౌలర్లలో అతీఖ్ ఇక్బాల్ రెండు వికెట్లు తీయగా, ఆయుష్ శుక్లా ఒక వికెట్ సాధించాడు.
ఆసియాకప్-2025లో భాగంగా అబుదాబి వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో హాంకాంగ్ బ్యాటర్లు పర్వాలేదన్పించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన హాంకాంగ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 143 పరుగులు సాధించింది. హాంకాంగ్ బ్యాటర్లలో నిజాకత్ ఖాన్(42) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ యాసిమ్ ముర్తజా(28), జీషన్ అలీ(30) రాణించారు.