ప్లేఆఫ్స్‌ చేరని పంజాబ్‌.. అర్ష్‌దీప్ కీలక నిర్ణయం! | Arshdeep-Undergoes Social Media Clean-up Delete 200 Posts Instagram | Sakshi
Sakshi News home page

ప్లేఆఫ్స్‌ చేరని పంజాబ్‌.. అర్ష్‌దీప్ కీలక నిర్ణయం!

May 26 2026 1:32 PM | Updated on May 26 2026 1:54 PM

Arshdeep-Undergoes Social Media Clean-up Delete 200 Posts Instagram

Photo Courtesy: IPL 2026

ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్ చేరడంలో విఫలమైంది. లీగ్ దశలో పంజాబ్‌ తమ చివరి మ్యాచ్ గెలిచినప్పటికీ, ముంబైపై రాజస్తాన్ రాయల్స్ విజయంతో పంజాబ్ ప్లేఆఫ్స్‌ ఆశలు ఆవిరయ్యాయి. పంజాబ్ ప్లేఆఫ్స్ చేరని నేపథ్యంలో ఆ జట్టు బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. 

సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే అర్ష్‌దీప్ సింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను చాలా వరకు క్లియర్ చేశాడు. దాదాపు 200 పోస్టులను ఇన్‌స్టా ఖాతా నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కోహ్లీతో కలిసి రీల్ చేసిన వీడియోను తొలగించడంపై అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీతో చేసిన రీల్ దాదాపు 15 మిలియన్ వ్యూస్ సాధించింది. 

ప్రస్తుతం అర్ష్‌దీప్ ఖాతాలో 44 పోస్టులు మాత్రమే ఉన్నాయి. అయితే అర్ష్‌దీప్ ఉన్నపళంగా తన ఇన్‌స్టా నుంచి పోస్టులు తొలగించడం వెనుక బలమైన కారణముంది. లీగ్ స్టేజ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మ్యాచ్ అనంతరం.. అర్ష్‌దీప్ సింగ్ ఓ రీల్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 

ఆ వీడియోలో పంజాబ్‌ స్పిన్నర్‌ చాహల్‌.. చేతులు అడ్డం పెట్టుకుని ఈ సిగరేట్ వేప్ చేస్తూ కనిపించాడు. దానిపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఆ ఘటన తర్వాత ఐపీఎల్ 2026 ముగిసే వరకు వ్లాగింగ్ ఆపేయాలని బీసీసీఐ అర్ష్‌దీప్‌ను కోరినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లకు సోషల్ మీడియా వినియోగంపై ఫ్రాంచైజీ కీలక మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. 

ఆటగాళ్లకు సంబంధించిన వీడియోలు ఇకపై ఫ్రాంచైజీ అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారానే రూపొందించి విడుదల చేయాలనే యాజమాన్యం కఠిన సూచనలు చేసింది. అందుకే అర్ష్‌దీప్ తన పోస్టులను తొలగించాడంటూ అభిమానులు పేర్కొన్నారు. 

ఇక ఐపీఎల్ 2026 సీజన్‌లో అర్ష్‌దీప్ సింగ్ పెద్దగా రాణించలేదు. 14 మ్యాచ్‌లాడిన అర్ష్‌దీప్ కేవలం 14 వికెట్లు మాత్రమే తీశాడు. అందునా ప్రతీ మ్యాచ్‌లోనూ ఓవర్‌కు దాదాపు 10 పరుగుల పైనే సమర్పించుకున్నాడు.

చదవండి: క్వాలిఫ‌య‌ర్ పోరు.. కోహ్లీ విష‌యంలో ఆందోళ‌న‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement