
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఆసియాకప్-2025లో భాగంగా దుబాయ్ వేదికగా పాకిస్తాన్‌పై అభిషేక్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 128 పరుగుల లక్ష్య చేధనలో అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. క్రీజులో ఉన్నంతసేపు బౌండరీల వర్షం కురిపించాడు.
ముఖ్యంగా పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిదిని ఈ పంజాబ్ ఆటగాడు ఉతికారేశాడు. భారత ఇన్నింగ్స్ మొదటి ఓవర్ వేసిన అఫ్రిది బౌలింగ్‌లో అభిషేక్ తొలి బంతినే బౌండరీకి మలిచాడు. ఆ తర్వాత రెండో బంతికి లాంగాఫ్ మీదగా అభిషేక్ కొట్టిన సిక్స్ మ్యాచ్ మొత్తానికి హైలెట్‌గా నిలిచింది.
మళ్లీ మూడో ఓవర్ వేసిన అఫ్రిది బౌలింగ్‌లో అభిషేక్ ఓ ఫోర్, భారీ సిక్సర్ బాదాడు. దీంతో షాహీన్ తెల్లముఖం వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరలవుతోంది. అభిషేక్ శర్మ కేవలం 13 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31 పరుగులు చేసి ఔటయ్యాడు. అంతకుముందు యూఏఈతో మ్యాచ్‌లో అభిషేక్ కూడా 30 పరుగులు చేశాడు.
భారత్ ఘన విజయం..
ఇక ఈ మ్యాచ్‌లో పాక్‌పై 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. 128 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 15.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి టీమిండియా చేధించింది. భారత బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్(37 బంతుల్లో 5 ఫోర్లు ఒక సిక్సర్‌తో 47 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలవగా.. అభిషేక్ శర్మ(16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31), తిలక్ శర్మ(31) రాణించారు.
6️⃣ & 4️⃣ last time, 4️⃣ & 6️⃣ this time 🥵🥶
Stay put & watch #INDvPAK as Abhishek takes off - #DPWORLDASIACUP2025. LIVE on #SonyLIV & #SonySportsNetwork TV Channels 📺#AsiaCup pic.twitter.com/guAssBLFJC— Sony LIV (@SonyLIV) September 14, 2025